పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

73

ఆరతిరుప్పావడ 505

కోవిలాళ్వార్ తిరుమంజనం 505

ఐనామహల్ సేవ 61

ఇదివరలో తోమాలసేవ, అర్చన, ఏకాంత సేవలను గురించి చెప్పఁబడినవిగదా. ఇనామహల్ శేవ ప్రస్తుతంలేదు.

ఆమంత్రణోత్సవము.

“ఒక దినమున శ్రీవారిపూజ, నివేదన చేయించినట్లు” భావముతో ఈ సేవ చేయఁబడును. ఆమంత్రణోత్సవము 1_కి పదిమంది జనమువంతున తోమాలసేవ, అర్చన, ఏకాంతసేవ. లకు వదలుటయేగాక మధ్యాహ్నము చిన్నగంగాళము పొంగలియు, రాత్రి 30 దోశలును నియ్య బడును. తోమాలసేవ కాలములోదత్తమునకు రూపాయి గృహస్టు ఇయ్యవలయును. ఇదిగాక హారతులకు వేఱేహారతి చీట్లు ఖచేరిలో సొమ్ము చెల్లించి పుచ్చుకొనవలయును. ఇది చేయించిన వారికొక మనోహారము బహుమానమియ్యఁ బడును.

పూలంగిసేవ.

గురువారము సాయంకాలము పూలంగి దర్శనమునకు మనిషికొక రూపాయి వంతున నియ్యవలె నని ఇది వరలో చెప్పఁబడెను గదా! శ్రీవారికి విశేషాలంకారముగా నుండు ఒక నిలువుటంగీ తొడిగి పుప్పాలంకార భూషితులుగఁ జేయుటయే పూలంగిసేవ యనఁబడును. ఇది చేయించినవారికి పూలంగిదర్శనము టిక్కెట్ లేకనె కొందఱిని దర్శనమునకు వద లెదరు. తీర్థప్రసాదములు బహుమానముగా నిచ్చెదరు.