పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

71

కళ్యాణోత్సవము.

ఈ యుత్సన మొక్క ఝాము జరుగును. శ్రీవారికి రెండవఘంట అయినతఱువాత ఉత్సవర్లును శ్రీతాయారులు సయి తము కళ్యాణ మంటపమునకు విజయంచేసి అచ్చట గృహస్థుచే సంకల్పము చేయించి మంత్రహోమయుక్తముగా వాద్యములతో కళ్యాణము శ్రీవార్లకు జరిపించి లడ్డు, వడ, దోశ, అప్పము నాలుగు గంగాళముల ప్రసాదములు ఆరగింపయి నాలుగువీధు లుత్సవమువును, ఆరగింపయి ప్రసాదములలో 30 లడ్లు, 30 వడలు, 30 అప్పములు, 60 దోశలు, 3 గంగాళముల ప్రసాదములు గృహస్థులకు ఇయ్యఁబడును. ఉత్సవమునకు అర్చ కులు మొదలగు కైంకర్యపరులకు వస్త్ర బహుమానము లియ్య బడును. కైంకర్యపరులకును దక్షణగూడా నియ్యఁబడును. గృహ స్థుఖ చేరిలో చెల్లించిన రూపాయిలు తిప్ప దత్తమున కొకరూపాయియు, హారతిరూపాయియుగాక ఇతర ఖర్చు లేమియు చేయసవసరము లేదు.

ఇతరవాహనములు.

తక్కిన ఉత్సవములు అనఁగా వాహనములు శ్రీవారికి రెండవఘంట అయిన తఱువాత జరుగును. హారతికి మాత్రము వేరే రూపాయి ఖచేరిలో చెల్లించి రసీదు తీసుకొనవలెను. ఎందరు ఒకేతరహావాహనమునకు సొమ్ము చెల్లించినను అందఱకు ఒకసారి వాహనము నాలుగువీధుల ఉత్సవము జరుగును గాని వేర్వేరుగా జరుగదు. వర్షము మొదలగు కారణములవలన వీధి ఉత్సవము జరుగ లేనంతట గుడిలోపలనే వాహనము వేసి శ్రీవారిని విజయం చేయించి గృహస్థు తెచ్చిన హారతిఅయి