పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

తిరుమల తిరుపతియాత్ర

మ్నాయముగ సర్వభూపాల వాహనమునకు అరటిచెట్లు మామిడియాకు తోరణములు గట్టి జరిపించెదరు. దీనితో బ్రహ్మోత్సవము పూర్తి అయినట్టు ఎంచవలెను. (బ్రహ్మోత్సవము దత్తమునకు ముందును, తేరునకుఁ దరువాతను గృహ స్తులను పైనఁజెప్పిన సేవకు వదలరు. ఈలోపు కాలములో విశేషదర్శనములు, మధ్యాహ్నము పొంగిలి ప్రసాదముగల చిన్న గంగాళము, రాత్రి దోసెలు ఇయ్యఁబడును. దత్తసమయముందు ఒరరూపాయియు, వాహనము జరిగినపు డొక్కొక్కహారతికి ఒక్కొక్క రూపాయియునియ్యవలెను. ఇవి దేవస్థానమునకు చేరును. బ్రహ్మోత్సవాంత్యమున వస్త్రమును తీర్థ ప్రసాదములను గృహస్థునకు బహుమతిచేసి వాద్యములతో వారి బసకుఁ బం'పెదరు.

వసంతోత్సవము

ఇది పదిరోజులు జరుగును. రెండవఘంట అయిన తఱువాత శ్రీవారికి ఉభయఅమ్మవార్లు సయితము ధ్వజస్థంభమునకు దక్షణముగనుండు తిరుమలరాయమంటపములో తిరుమంజసము, అలంకారము అయి వడపప్పు పానకము నివేదన చేయబడును. సంపంగి ప్రదక్షణముగ శ్రీవారు ఉగ్రాణము ముందు మంటపమునకు దయచేసి అచ్చట ప్రసాదములు నివేదనయి శ్రీవార్లకు కుంకుమపువ్వుకలిపిన చందనము సమర్పణయి శేష చందనమును, తాంబూలము సహా వినియోగమవును. అనంతరము నాలుగు వీధులు ఉత్సవము జరుగును. ఇట్లు పది దివసములు జరిగిన తరువాత బ్రహ్మత్సవములోవలెనె గృహస్థుకు బహుమానము జరుగును.