పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతియాత్ర.

69

(a) ఉత్సవములు

శ్రీవారికి రెండవఘంట అయిన తఱువాత యాత్రికుల యొక్క ఆర్జితోత్సవములు జరుగును.

ఉత్సవములకు చెల్లించు సొమ్మువివరము.

1_వ తరగతి బ్రహ్మోత్సవము 1205

2_వ " 925

3_వ " 805

4_వ " 705

5_వ " 625

6 వసంతోత్సవము 1005

7 వజ్రకవచము లేనివాహనము 41

8 వజ్రకవచము సహావాహనము 61

9 కళ్యాణోత్సవము 305

10 ఇతర వాహనము 21

 (అనఁగా గరుడవాహనము మొదలగునవి)

బ్రహ్మో త్సవము.

ఇందుకు 8 దివసములలో 16 వాహనములు జరుగును. గాని దేవస్థానము సౌకర్యమును, ఇతయాత్రికులకు ఇబ్బంది లేమియు యోచించబడును. బ్రహ్మోత్సవము దత్తమైనది మొదలు బ్రహ్మోత్సవగృహస్థుల తాలూకు మనుజులను బ్రహ్మోత్సవము తరగతివారిని బట్టితో మాలసేవ, అర్చన, ఏకాంత సేవకు వదలెదరు. మొదట శ్రీవారికి రెండవఘంట అయినతఱువాత వెండితిరిచిలో శ్రీవారికి వజ్రకవచము సమర్పణయి బ్రహ్మోత్సవముద దత్తమవును. వాహనములు ఆఖగున తేరుకు ప్రత్యా