పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

తిరుమల తిరుపతియాత్ర

10 రథసప్తమి.

ఇది మాఖశుద్ద 7_వ దివసమునకుఁబేరు. ఈదినమునఁ దెల్ల వారుసరికి మొదటిఘంటఅయి శ్రీవారుసూర్యప్రభవాహనము మీఁద వజ్రకవచము మొదలగునవి సమర్పణఅయి సూర్యోదయమునకు ఉత్తరపువీథిలో వాహనముండవలెను. సూర్యప్రభవాహనముమీఁద వి శేషాభరణ భూషితులై సూర్య కిరణములు శోకగా దేదీప్యమానులై యుండు శ్రీవారు పాదాక్రాంతుఁడగు సూర్యున కభయమిచ్చురీతి శోభిల్లుచుందురు, తఱువాత చిన్న శేష, గరుడ, హనుమంత వాహనములు జరిగి చక్రస్నానమయి రెండవఘంట అయిన పిదప శ్రీవారి ధర్మ దర్శన మగుచుండగ సర్వభూపాలము, కల్పవృక్షము, చంద్ర ప్రభ వాహనములు జరిగి శ్రీవార్లు సన్నిధికి విజయం చేసిన తఱువాత రాత్రి ఘంటయి గుంపు లేక నే (గురువారం తప్ప) తీర్మా నమయి తలుపులు వేయఁబడును, రథసప్తమికి అర్థ బ్రహోత్సవ మని పేరుగలదు.

అ ధ్యా య ము VI.

ఆర్జితము.

శ్రీవారికి యాత్రికులు సొమ్ము తిరుపతి శ్రీవిచారణకర్తలవారి ఆఫీసులోఁగాని తిరుమల దేవస్థానము పారుపత్యదార్ ఖచేరిలోఁగాని చెల్లించి శ్రీవారికి ఉత్సవములు, నివేదనలు, శేవలు చేయించవచ్చును. ఇట్లు చెల్లించుసొమ్మునకు రసీదులు ఇయ్యఁబడును.