ఈ పుట ఆమోదించబడ్డది
50
అన్నమాచార్య చరిత్రము
అంకితము
నని యలమేలుమంగాధీశు పేర-
నినమండలాంతరాహితమూర్తి పేర-
హరి పేర దరచక్రహస్తుని పేర
ధర నెన్ను మాకులదైవంబు పేర-
నాలీలఁ దాళ్ళపాకన్నమాచార్యు-
నేలిన శ్రీవేంకటేశ్వరు పేర-
నంకితంబు గను శ్రీహరిభక్తపాద-
పంకజార్చక తాళ్ళపాకాన్నమార్య-
తనయ తిమ్మార్యనందన రత్న శుంభ-
దనుపమ శ్రీవేంకటాధీశదత్త-
మకరకుండలయుగ్మ మండితకర్ణ
సకలవైష్ణవపాద సంసేవకాబ్జ-
సదానా వధూలబ్ధ సరసకవిత్వ-
విదితమానస తిరువేంగళనాథ-
విరచిత సద్భక్తి విభవాన్నమార్య-
చరితంబు జగదేకసన్నుతం బగుచు
నాచక్రశంఖాంక యశముతోఁగూడ
నాచంద్రతారార్కమై యుండుఁగాత.