ఈ పుట ఆమోదించబడ్డది
4
అన్నమాచార్య చరిత్రము
జననపంరంపరా శతసహస్రముల
వెనుకకు మేము దుర్విషయానురక్తిఁ
గుక్షింభరులమైన కొదవెల్లఁ దీఱ
రక్షించి, మా యపరాధము ల్మఱచి
యేపుట్టువున మిమ్ము నెఱుఁగంగఁజేసి
నీ పాలివారిఁగా నియమించి మమ్ము
హరి! మిమ్మునే కొనియాడు మా జిహ్వ
నొరులను గొనియాడకుండంగఁజేసి
కంటులేనట్టు లక్ష్మణగురు మతము-
వంటి సన్మతము మీవంటి దైవతము
తనవంటి గురుని నందఱలోనఁ దెచ్చి
వనజాక్ష!నేఁడు మావంటివారలకుఁ
గరతలామలకంబుఁ గావించెఁ గనుక
అరయఁగఁ దాళ్ళపాకన్నయాచార్యు -
పరమోపకార మెప్పటికి డెందమున
నరయచుఁ గొనియాడు టది యెుప్పుఁగనుక ,-
నాయనఁ జూచి మాయపరాధకోటు -
లేయెడఁ దలఁచక యెడఁబాయ కెపుడు-
నే యాపదలు మమ్ము నెనయక యుండ
మా యిలువేల్పవై మన్నించుకతన,
నందను సద్వర్తనము తండ్రి ప్రియము-
నొందఁ గీర్తించుట యుచితంబు గనుక,
అఱలేక, యీ యన్నమాచార్యచరిత
వెఱవక నీకు నే విన్నవించెదను ;