అన్నమాచార్య చరిత్రము
43
నను నీవు పిన్నటనాఁటనుండియును
బనుపడ బంటుగాఁ బసిగొంటి గనుక
మందెమేళమున నీ మహిమఁ జింతింప-
కిందఱవలె నేన యిట్టు చేసితివి
వేంకటపతివి నీవే మాకు మనసు-
శంఖ లింకించి ప్రసన్నుండ వగుము
నీ వలగిన నల్గు నీలవర్ణుండు
నీవు మెచ్చిన మెచ్చు నీరజోదరుఁడు-
నాయర్ధ మంతయు నన్నమాచార్య
నీయందే కంటిమి నిక్కంబు గాఁగ;
నని పట్టమహిషితో నతనిఁ గీర్తీంచి
పనిఁబూని పన్నీటఁ బాదముల్ కడిగి
బంగారు విరులజొంపములఁ బూజించి
పొంగారువేడుక భూషణావళులఁ
జిత్రాంబరంబులఁ జిత్రవస్తువులఁ
జిత్రంబుగాఁగ భూషించి తోషించి
తనకుఁగా మును పాయింతంబైన పసిఁడి-
యనుసుల చతురంతయాన మెక్కించి
భజియించి తనమూఁపు పల్లకికొమ్ము
నిజభుజంబున నిడి నెమ్మి గావింప,-
అన్నమాచార్యుఁడు రాజు ననుగ్రహించుట
నది గని ముదమంది యన్నయార్యుండు
సదయుఁడై నృపతి నెంజలిఁ బ్రస్తుతించి
మునుపటి నీచేయు మెుక్కలంబునకు-
ననుతాపమును జెంది తది కారణమున