ఈ పుట ఆమోదించబడ్డది
38
అన్నమాచార్య చరిత్రము
నత్తఱి మదిలోన హరికీర్తి మెులక-
లొత్తినగతి నున్న యూర్ధ్వపుండ్రములు
లాలితాచ్యుతభక్తిలలన వరించు-
మాలికగతి తిరుమణివడంబులును
తలనిడు విష్ణుపాదపుఁ దమ్మిపువ్వు
మెులుపైన కెంబట్టు మేలుకుళ్ళాయి
అరవిందనయను కృపామృతధార-
కరణిఁ జూపట్టెడు కంఠమాలికయు
నరహరికై కంకణము గట్టియున్న-
సరణిఁ జూపట్టు పచ్చల కడియములు
ధవళనేత్రుని శారదావిలాసంబు
నివసించునట్లున్న నిలువు పేరణము
వాసుదేవునియాజ్ఞ వడిఁ జుట్టుకొన్న-
యా సత్త్వగుణమన నలరు దుప్పటము
నలవడఁ జతురంతయానంబు నెక్కి
బలసి సంకీర్తనపరులు సేవింప
ఘనతర ధవళ శంఖాధ్వాన మడరఁ
జనుదెంచి నృపతి యాస్థానంబు చెంతఁ
బల్లకి డిగి వెంటఁ బరఁగు వైష్ణవుని-
నల్లన చెయ్యూఁది యాలోని కరిగి
కూరిమిఁ దనరాక కోరి వీక్షించు-
నారాజుఁ గదిసి నెయ్యముతియ్య మెసఁగ
సొలవక "శ్రీనివాసో రక్ష" తనుచు
నెలమిఁ జేతిరుమణి నిచ్చె నిచ్చుటయు,