అన్నమాచార్య చరిత్రము
35
సహజవైష్ణవభక్తి సలిపెడువాని-
సహవాసమైన దోసములేదటంచు-
నతఁడు పట్టించిన యందలంబెక్కి
యతఁడు భృత్యప్రాయుఁడై కొల్చి రాఁగఁ
జని టంగుటూరి కేశవమూర్తిఁ గాంచి
వినతుఁడై యతఁడు కోవెలదండ దనకు
సకలసంపదలతో సవరించియున్న-
యెుక పెద్దనగరిలో నొగిఁ బ్రవేశించె;-
నరసింహరాయఁడు విజయములందుట
నానాఁట నా నరనాథుండు వేఱు-
లేని కూరిమితోడ లీనమైయుండె ;
తన సంపదలు సమస్తము నన్నమయ్య-
వని యెన్ను నడకల నారీతి నడుచు-
నే పని గలిగిన నెఱిఁగించికాని
చేపట్టి తనయంతఁ జేయఁడెప్పుడును
హితునిఁగా గురునిఁగా నెల్లబంథులఁగ
నతనినే భావించి యంగవింపుచును
పావనుండగు తాళ్ళపాకాన్నమయ్య-
దీవెనలంది వర్ధిలుచు నా రాజు
బలియుఁడై పరిపంథిబలముల నడఁచి
నలిరేఁగి సింహసనంబు చేకొనుచు
తన రాజధానియై తనరారు పసిఁడి-
పెనుగొండగతి నుండు పెనుగొండ నుండి
యన్నమాచార్యుల నటకు రావించి
యెన్నిక నెదురుగా నేతెంచి మ్రెుక్కి