Jump to content

పుట:జీవితచరితం అన్నమయ్య-2000-చినతిరువేంగళనాథుడు.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నమాచార్య చరిత్రము

31


కేలిమై వెన్నునిఁ గీర్తింపుచున్న-
బాలుని రూపు తప్పక విలోకించి
యెఱుఁగఁగా హరి యానతిచ్చినయట్టి-
గుఱుతులన్నియు దొరకొన సంతసమున-
నన్న నీ పేరేమి యనిన నా వడుగు-
నన్నయ నా నామమని సాఁగి మ్రెుక్కి
వినుతింపఁ జూచి సవిస్మయుండగుచు
మునినాధుఁ డాతని ముద్దుసేయుచును
తనచేత నీపు ముద్రాధారణంబు
గొనికొని సేయించుకొనఁగ నోపుదువె
యన విని శిశువు కృతార్థుండనైతి-
నన విని వేదమార్గానుసారమున-
నాతని శంఖచక్రాంకితుఁ జేసి
రీతిగాఁ బంచసంస్కృతులు గావించి
శ్రీనాధుఁ డానతిచ్చిన ప్రకారంబు
తాను వైష్ణవులు నాతఁడు భుజియించి
తన కలగన్న యంతయుఁ దేటపఱచి,
దులగుచు.......

గ్రం థ పా త ము


వేద్యంబులగు వేద వేదాంతముఖ్య-
విద్యల నధికులై వెలసియుండుదురు
తెల్లంబుగా దేహదేహిభావమున-
నెల్లవస్తువులును నీవెకాఁ దలఁచి