ఈ పుట ఆమోదించబడ్డది
30
అన్నమాచార్య చరిత్రము
అన్నమయకు వైష్ణవయతిచే పంచసంస్కారములు
పాయని తనమీఁద పరమానురక్తిఁ
దోయజాక్షుం డల తొలినాఁటి రాత్రి-
నవఘండు హరిపరాయణచిత్తుఁడైన
ఘనవిష్ణుండను మౌనికలలోన వచ్చి
దయమీఱ నిట్లనుఁ దాళ్ళపాకాన్న-
మయ నామకుండైన మద్బక్తుఁడొకఁడు
వడుగు నల్లని చిన్నవాఁడు నన్నెపుడు
నడుఁకక సంకీర్తనము సేయు నతఁడు
ముద్దుగారెడువాఁడు మెహనంబైన-
మద్దికాయలవాఁడు మనవాఁడె వాఁడు
గుదిగొన్న నునుపట్టుకుచ్చుల దండె
ముదమున నిజభుజంబున నించువాఁడు
కడవేగ రేపు నీకడ కేఁగుదెంచుఁ
దడయక నీవు ముద్రాధారణంబు
గావింపు నా మాఱుగా వాని కనుచు
దేవుఁడు తనదు ముద్రిక లిచ్చె; నంత
యతి మేలుకొని యరుదంది గోవిందు-
సతమైన భక్తవాత్సల్యంబుఁ బొగడి
యఱిముఱి సూర్యోదయంబునకెల్ల
మఱవక నిత్యకర్మంబులు దీర్చి
కరమున శంఖచక్రపుముద్ర లంది
హరి యాజ్ఞ వాకిటి కరుదెంచి నిలిచి