20
అన్నమాచార్య చరిత్రము
మూర్తులన్నియు నొక్క మొత్తమైనట్లు
వర్తింపుచున్న నా వడువు వీక్షించి
మహిత సాలగ్రామమయమౌ నటంచు
బహువిస్మయము నొంది ప్రణతు లొనర్చి
యా జగజ్జననికి నభివాదనంబు-
లోజఁ గావింప నయ్యువతీలలామ
శౌరియుఁ దాను నిచ్చల పొత్తుగలసి
యారగించిన ప్రసాదాన్నముల్ దెచ్చి
పరిపరిరుచుల నేర్పడ సేదదేర
పెరిమతో భుజియింపఁబెట్టి యూరార్చి
తిరుమలప్పని దేవదేవునిఁ గొలువ-
నరుగుమటంచు నయ్యరవిందసదన
తొల్లింటికరణి కౌస్తుభరత్న హారు-
నుల్లంబుమీఁదట నుండె నుండుటయు,
శ్రీమూర్తులందుల చిహ్నంబు లిపుడు-
నా మహాచలశిలలందు నింపొందు-
అన్నమయ్య దేవి పై శతకము చెప్పుట
నత్తఱి నలుదిక్కు లరసి యా శిశువు
చిత్తంబులోన నచ్చెరవందుకొనుచు
కలయెు యాందోళమెు కాక నిక్కంబొ
కలవళంబో దీని కరణి యే కరణి
యని నిక్కమని యాత్మ నలరి యా పద్మ
తనకేల నిడు ప్రసాదప్రభావమున
పరమసారస్వత పారీణుఁ డగుచు
సరసకవిత్వ వాచాప్రౌఢి మెఱసి