Jump to content

పుట:జీవితచరితం అన్నమయ్య-2000-చినతిరువేంగళనాథుడు.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నమాచార్య చరిత్రము

19


పెద్దముత్తైదువ పేర్మితో బాలు
నొద్దకు నేతెంచి యూఱడింపుచును
పడుచ!యేమిటి కిటఁ బడియున్నవాఁడ-
వదలక లేచి రమ్మన్న, నాశిశువు
పైకొన్న యాఁకలి బలుదవ్వు నడచి
రాకఁ గన్నులు గానరావు మా యమ్మ!
అందుల కొక యుపాయముఁ జెప్పి నాకుఁ
గందర్పజనకునిఁ గనజేయుమమ్మ!
యనపుడు కమలామహదేవి శిశువుఁ
దన కృపామృతధారఁ దనివి నొందించి
బాలక! యీ మహాపర్వతేంద్రంబు
లాలిత సకల సాలగ్రామమయము
ఘనులకు నిధి చెప్పుఁగాళ్ళ నెక్కంగఁ
జనదు నీ చెప్పులు సడలించి వైచి
కనుఁగొను కన్నులఁ గనవచ్చు ననిన
విని బాలుఁ డట్ల కావింతు నే ననుచు
గ్రక్కునఁ బాదరక్షలు దీసివైచి
యక్కొండఁ గనుఁగొనుమపుడు, గన్నులకు
వనమాలికలచే సువర్ణరేఖలను
గనుపట్టు గొనవెండ్రుకల కురంగముల
వేణు బాణాసన వితతచక్రముల
రాణించి ధరణీవరాహవైఖరుల-
నా రమానారాయణాకృతి గలిగి
శ్రీరామకృష్ణ లక్ష్మినృసింహాది