Jump to content

పుట:జీవితచరితం అన్నమయ్య-2000-చినతిరువేంగళనాథుడు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

అన్నమాచార్య చరిత్రము


పరువంపుఁ దలిరుజొంపములఁ బెంపొలయు
మకరతశ్యామ నిర్మల నిజాకృతుల-
నెదురు చల్లనితావు లెసఁగించు వెదురు-
పొదక్రిందఁ గూర్చుండి పొలయు లేఁజెమటఁ
దొడిగిన చెప్పులతోడనే మిగుల
బడలిక నొకరాతిపై శయనింప,

అన్నమయ్యకు దేవి ప్రత్యక్షమగుట



నితరు లెవ్వరి యాత్మ లెఱుఁగని యట్టి-
యతని యాఁకలి జగదంబ తా నెఱిఁగి
యలమేలుమంగ తియ్యము నెయ్య మెసఁగ
బలుచన్నుఁగవ తుదఁ బాలు చిప్పిలఁగ
మినుకారు క్కొక్కారుమెఱుఁగుచందమున
ఘనపయోధరములఁ గడుఁజూడఁ గలుగి
దినుసైన లేఁబువ్వుఁదీగెకైవడిని
మెనసిన బలుమెుల్లమెుగడలఁ దనరి
పనుపైన రాచిల్కభాతిఁ జక్కెరలు-
గొసరెడు పల్కుల గొనబు చూపుచును
విరివింటివాని చే వెడవింటి నారి
దొరసి నిక్కిన కొప్పుతో నొప్పు మీఱి
కమనీయమగు చంద్రకళ సోయగమున
నమృతాధరస్థలి నలరి చూపట్టి
కులుకుఁదాపుల తమ్మికొలని భావమునఁ
బొలుచు హంసక నాదములు బిడారించ