అన్నమాచార్య చరిత్రము
17
యల్లారునని మును లనిశంబుఁ బొగడ
గనుపట్టునట్టి యా గ్రామంపు శక్తిఁ
గనుఁగొని బహు నమస్కరముల్ జేసి
అళిపుళిసింగరి నర్చించి మ్రొక్కి
తలి యేఱుగుండు సందర్శించి కదలి
పెద్ద లెక్కడుగాఁగ బేర్కొనుచుండు-
పెద్దయెక్కుడుఁ గూర్మి పెనఁగొన నెక్కి
కపురంపుఁ దావులు గడునూలుకొలుపుఁ-
గపురంపుఁగాలువఁ గడచి యంతంత-
నామహాచలవీధి నలరారు పుణ్య-
భూమిజంబులఁ బుణ్యభూములు జనులఁ-
బావన నదుల శోభన వస్తుతతుల
సేవించికొనుచు మచ్చిక వచ్చి వచ్చి
వేకువజామున వెడలి జామెక్కు-
దాఁక మిక్కిలి యెండదాఁకంగ నడిచి
యెన్నఁడు తల్లిపక్కెడసి యెుండెడల-
నున్నట్టివాఁడు కాకుండటవలన
కడపవాకిలి దాఁటి కడయిండ్లకడకు
నడచుట మునుపు నెన్నఁడు లేదు గనుక
నాఁకట నసురసురై బాలకుండు
మెఁకాళ్ళ ముడుపు నిమ్ములఁ జేర వచ్చి
కమ్మని గణుపుచెంగట వాటమైన-
తుమ్మెదతొలుల సందుల చల్లగాలి
రాణ దూఱఁగ వింతరాగంబు పొసఁగ
వేణునాదము సేయు వెన్నుఁడో యనఁగ