Jump to content

పుట:జీవితచరితం అన్నమయ్య-2000-చినతిరువేంగళనాథుడు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

అన్నమాచార్య చరిత్రము


సంకీర్తనంబులు సవరించు నిచ్చ
అసమాన నిజరేఖ యాత్మఁగీలించి
వసుధ నటించు సంవర్తుభావమున

అన్నమయ తిరుమల యాత్ర



నింటివారలు పిల్చి యేమి చెప్పినను
గెంటనాడక పరికించి సేయుచును
జననియు నన్నయ జనకుండు వదినె
యును గొన్నిపనులు సేయుచుఁ దన్నుఁ బిలిచి
పసులకు కసవుఁ దేబనుప బాలుండు
వెస నేఁగి వాఁడి లవిత్రంబు పూని
మరకతాంకూరకోమల భర్మరుచులఁ
గరమెుప్పు పచ్చని గఱిక వీక్షించి
పాపవల్లరుల శ్రీపతినామహేతి
నాపారఁ దఱుగు యోగీంద్రుచందమున
కెసిమస నొక పిడికెఁడు గోసి మఱియుఁ
గసవు గోయఁగఁబోయి కడవ్రేలు సోఁకి
వడియు నెత్తురు సూచి వాక్రుచ్చి శౌరి-
యడుగులు దలఁచి శ్రీహరి హరీ !యనుచు
నీ కోఁతకొలది నాదెఱిఁగిన వదినె
చేకోఁత పడఁగాదు చీ రోఁత యనుచు
హరి చరాచరదేహి యని పెద్ద లనఁగ
నిరవొంద నెఱిఁగియు నిటు సేయఁదగునె
చిడిముడి నేమి చేసెదనంచు చేతి-