ఈ పుట ఆమోదించబడ్డది
10
అన్నమాచార్య చరిత్రము
స్వామి!కేశవ!సరస్వతి మామ!విద్య
తామసింపక నాకు దయ సేయు మనుడు,
ఆ మాధవునికృప నంబుజాసనుని-
భామ యాతని జిహ్వపైఁ బాదుకొనియె;
సరగున మఱునాఁడు నని యర్భకుండు
గురునకు మ్రెుక్కి మక్కువఁ దనతోడఁ
జదివెడుపడుచు లాచార్యుండు శాస్త్ర-
విదులును జూచి నివ్వెఱఁగంది పొగడ
పంచినచోటెల్లఁ బదమును గ్రమము
కొంచించ కతఁడు గ్రక్కునఁ జెప్పి మఱియు
క్రమ శిఖ జటయు వర్ణక్రమసరణి
బ్రమయక నిజవేదపాఠంబు సలిపి
కడమవిద్యలయందుఁ గడునేర్పు గలిగి
కడఁక వారల మెచ్చు గైకొని వచ్చి
జగతి నందఱుఁ జూచి సర్వజ్ఞుఁ డనఁగ
మిగుల వాక్ప్రౌఢిమ మెఱయుచు నుండె;
నారాయణసూరి
ఆతఁడు గనియె నారాయణసూరి
నాతత సకలవిద్యాధురంధరుని ;
నా మహత్ముఁడు లక్కమాంబను పేరి
భామినీరత్నంబుఁ బరిణయంబయ్యె;
ఆ కల్పకములాకయగు తాళ్ళపాక
యాకడఁ గడలేని యభనవశ్రీల
మాడువూరను నూర మాధవమూర్తి
తోడునీడై యాపెతోమాటలాడు;-