ఈ పుట ఆమోదించబడ్డది
9
అన్నమాచార్య చరిత్రము
నేల కేలిడితి విందేల వచ్చితివి
అనుడు నారాయణుఁడను బాలకుండు
కనుదోయి కన్నీరు గదుర నిట్లనియె;
అఱిముఱిఁ జదువురాదని యయ్యవారు
పఱచు నాపాటులఁ బడనోప కేను
అలసివచ్చితి నిట కన్న నద్దేవి
వలవదు నీకేల వగవు నా తండ్రి!
గొనబుమీఱిన పలుకులజోటి మామ
జనమేజయునకుఁ బ్రసన్నుఁడైనాఁడు
ఆ శంకరాదులు నతని వేడుదురు
కేశవుం డాశ్రితక్లేశనాశకుఁడు
మీ తాళ్ళపాకలో మెఱయుచునుండు-
నా తామరసనేత్రు నాలయంబునకు
వలసుట్టి మ్రెుక్కు మవ్వల వాని కరుణ-
నలరుచు సకలవిద్యలు నీకు వచ్చు;
అదియునుఁగాక మూఁడవ తరంబునను
వదలని కీర్తీ మీ వంశంబునందు
పరమభాగవతుఁడు ప్రభవించు శౌరి-
వరమున జగదేకవల్లంభుండగుచు;
అనుచు నంతర్హితమైన నా పాపఁ-
డనయంబు హర్షించి యరుదందికొనుచు
ఆ తాళ్ళపాకకు నరిగి వేవేగ
జాతరూపాంశుఁ గేశవు గాంచి మ్రొక్కి
స్వామిగేహములకు వలచుట్టి కేలు-
దామరల్ మెుగిచి యత్తఱి శరణొంది