పుట:చెన్నబసవరగడ (పాల్కురికి సోమనాథుఁడు).pdf/2

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక

బసవ పదకమల పరాగ పటలతిలక..............చెన్నబసవ
బసు పద కమలనుతి ప్రహర్ష పులక.....................ײ
బసవ పద నఖాంశుకౌముదీచకోర.....................ײ
బసవ పాదనఖర ముకుర సుఖశరీర.....................ײ
బసవ పదరవింద గత మరందసిక్త.....................ײ
బసవ పదరవింద కాంత కాంతియుక్త.....................ײ
బసవ పాద తళమరాళ [1]జాలకల్ప.....................ײ
బసన సద్గుణ స్మరణ చణావికల్ప.....................ײ
బసవ పాదకమల విమల సదనవాస.....................ײ
బసవ పాదభక్తి వాసనా విలాస.....................ײ
బసవ పదవిశేష భక్తి వేషభూష.....................ײ
బసన పాదభక్తి పల్లవిత మనీష.....................ײ
బసవ పాద ఘననినాద వనమయూర.....................ײ
బసవ పాద కంజ పంజరోరుకీర.....................ײ
బసవ గీత జాత నీత [2]సారగర్భ.....................ײ
బసవ పారిజాత పోత కలితగర్భ.....................ײ
బనవ కల్ప మహిజ మూలికాదిసిద్ధ.....................ײ
బసవ కల్ప వల్లరీ వితాన బద్ధ.....................ײ
బసవ కల్ప భూరుహోరు చారుశాఖ.....................ײ
బసవ దివిజ భూజవర శిఖామయూఖ.....................ײ
బసవ కల్ప కుజనవాంకు[3]రానుకూల.....................ײ
బసవ కల్పవృక్ష పల్లవాంశు జాల.....................ײ
బసవ గురు మరుత్తరు ప్రచుర శలాటు.....................ײ
బసవ గురు మరుత్తరు ప్రసూనవలయ.....................ײ

  1. కూళ
  2. జపన
  3. రయతుకాల