పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

89

36. షేక్‌ ముహమ్మద్‌ గులాబ్‌

(-)

భారత స్వాతంత్య్రోద్యమంలో చంపారన్‌ రైతాంగ పోరాటం చిరస్మరణీయమైంది. బ్రిటిష్‌ ఇండిగో ప్లాంటర్ల పెత్తనం, కిరాతక చర్యలకు వ్యతిరేకంగా చంపారన్‌ రైతులు ఉద్యమించి విజయం సాధించారు. ఈ రైతాంగ పోరాటం ఫలితంగా ఇండిగో ప్లాంటర్ల దుశ్చర్యలకు భరతవాక్యం పలికిన ప్రత్యేక చట్టం అమలులోకి వచ్చింది. అంతటి మహోద్యామానికి నాందీవాచకం పలికిన రైతుల నేత షేక్‌ ముహమ్మద్‌ గులాబ్‌.

బీహార్‌ రాష్రంలోని చంపారన్‌ ప్రాంతాన్నిబ్రిటిషర్లు ఇండిగో ఉత్పత్తికి అనుకూలమైన ప్రదేశంగా ఎంచుకుని స్థిర నివాసాలను, కర్మాగారాలు నిర్మించుకున్నారు. అవసరమైన ముడిసరుకు కోసం ఆ ప్రాంతపు భూములను ఉపయాగించదలిచారు. అందువల్ల తాము కోరిన పంటను మాత్రమే పండించమంటూ రైతుల వత్తిడి చేయసాగారు. అందుకు అంగీకరించని రైతులు ప్లాంటర్ల నుండి, ప్లాంటరకు అనుకూలంగా ఉన్న బ్రిటిష్‌ ప్రబు త్వం నుండి ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. రైతులను పశువుల కంటే హీనంగా భావించిన ప్లాంటర్లు, పోలీసు బలగాల సహకారంతో విరుచుకుపడ్డారు. రైతుల స్వేచ్ఛను హరించి వేశారు. ఆ కారణంగా చంపారన్‌ ప్రాంతపు గ్రామాలలోని రైతు లు అనుక్షణం భయంతో ప్రాణాలను అరచేత పెట్టుకుని బ్రతుకుతున్నారు.

చిరస్మరణీయులు