పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

79

31. ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం ఖాన్‌

(1853-1906)

ప్రభువు ఆగ్రహానికి గురికాక తప్పదని తెలిసినా ప్రజలపక్షం వహించి, జాతీయోద్యామంలో భాగంగా బ్రిటిషు-నిజాం వ్యతిరేక పోరాటాల దిశగా ప్రజల్ని మేల్కొల్పిన తొలితరం వైతాళికులలో ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం ప్రముఖులు. ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం 1853లో మద్రాసులో జన్మించారు. ఆయన ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఆయన తలితండ్రులు హెదారాబాదుకు వచ్చి నైజాం సంస్థానంలో స్థిరపడ్డారు. అబ్దుల్‌ ఖయ్యూం దారుల్‌ ఉలూంలో పర్షియన్‌, అరబ్బీ భాషలను నేర్చుకున్నారు. ఆ తరువాత ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూరు వెళ్ళి ఉన్నత విద్య పూర్తి చేసి వచ్చిన ఆయన 1875లో హైదారాబాద్‌ సంస్థానంలో ఉద్యోగిగా ప్రవేశించారు. ప్రతిభా సంపన్నుడైన ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం అచిరకాలంలో ఉన్నతాధికారిగా ఎదిగారు. 1880లో సరోజనీ నాయుడు తండ్రి డాక్టర్‌ అఘోరనాధ్‌ చోపాధ్యాయతో ఆయనకు కలిగిన పరిచయం హిందూ-ముస్లింల మధ్య ఐక్యతకు ప్రతీకగా నిలచి, హైదారాబాదు సంస్థానంలో ప్రముఖ చారిత్రక సంఘటనలకు, పరిణామాలకు కారణం అయ్యింది. ప్రజోపకర కార్యక్రమాల పట్ల చిన్నతనం నుండి శ్రద్ధ చూపుతూ వచ్చిన ఆయన ప్రబుత్వాధికారిగా బాధ్య తలు నిర్వహిస్తూ ప్రజలలో విద్యావాప్తికి నవ్య చెతన్యానికి

చిరస్మ రణయులు