పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

77

30. జస్టిస్‌ బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ

(1844-1906)

మాతృభూమిని విదేశీయుల పాలననుండి విముక్తం చేయాలన్న సంకల్పంతో మూడుతరాల వ్యక్తులు విముక్తి పోరాటంలో పాల్గొన్న విశిష్ట చరిత్ర కలిగిన తయ్యాబ్జీ కుటుంబలోని ప్రముఖులు జస్టిస్‌ బద్రుద్దీస్‌ తయ్యాబ్జీ.

మహారాష్ట్రలోని కాంబేలో1844 అక్టోబర్‌ 8న బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ జన్మించారు. తండ్రి తయ్యాబ్‌ ఆలీ, తల్లి అమీనా తయ్యాబ్జీ. స్వదేశీ విదేశీ వ్యాపారాలలో తనదైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న తయ్యాబ్‌ ఆలీ బిడ్డలకు ఆదునిక, ఆంగ్ల భాషల్లో చదువులు చెప్పంచారు. చిన్న వయస్సులో ఉరూ, పర్షియన్‌, అరబ్బీ, గుజరాతి, మరాఠి భాషలను, కొద్దిగా ఆంగ్ల భాషను నేర్చుకున్న బద్రుద్దీన్‌ 1860లో లండన్‌ వెళ్ళి కొంతకాలం తరు వాత ఇండియా వచ్చి 1865లో మోతి బేగంను వివాహమాడారు. 1867లో మళ్ళీ లండన్‌ వెళ్ళి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకుని బొంబాయి వచ్చి ప్రాక్టిస్‌ అరంభించారు. అతి కొద్ది కాలంలోనే అత్యధిక సంపాదన గల బారిస్టర్‌గా పేరుగాంచారు.

బొంబాయి కార్పొరేషన్‌లో సాగుతున్న అవినీతికి, హద్దులు మీరిన ఆంగ్లేయ అధికారుల పెత్తనానికి, పేదల నివాస ప్రాంతాలలో కనీస సౌకర్యాల కల్పనలో అధికారగణం చూపుతున్న అలసత్వానికి వ్యతిరేకంగా త్రీస్టార్స్‌ గా ఖ్యాతిగాంచిన మిత్రులు

చిరస్మ రణయులు