పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

75

29. రహిమతుల్లా యం. సయానీ

(1847-1902)

1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రప్రథమ సమావేశానికి మొత్తం 72 మంది ప్రముఖులు హజరు కాగా, అందులో ఇరువురు ముస్లింలున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు రహిమతుల్లా ముహమ్మద్‌ సయానీ కాగా మరోకరు అబ్దుల్లా ధర్మాసి.

బొంబాయిలోని ఒక అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంలో 1847 ఏప్రిల్‌ 5న జన్మించిన రహిమతుల్లా తండ్రి పేరు ముహమ్మద్‌ సయానీ. ఆంగ్ల భాష పట్ల ముస్లిం సమాజంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న రోజుల్లో 1868లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీని సాధించిన తొలిముస్లింగా ఖ్యాతిగాంచిన సయాని 1870లో న్యాయశాస్త్రం పూర్తి చేసి బొంబాయిలో సమర్ధుడైన న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు గడించారు.

న్యాయవాదిగా రాణిస్తూ సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ ప్రజల మన్నన పొందిన ఆయన 1876లో బొంబాయి మున్సిపల్‌ కార్పోరేషనకు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ 1888లో బొంబాయి కార్పోరేషన్‌ మేయర్‌ పదవి చేపట్టారు. ఆ తరువాత ప్రాంతీయ రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల మీద దృష్టి నిల్పిన సయానీ 1885లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రారంభోత్సవ సమావేశానికి హాజరయ్యారు.

చిరస్మరణీయులు