పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

65

24. బేగం హజరత్‌ మహల్‌

(- 1874)

మాతృభూమి కోసం ప్రాణాలను పణంగాపెట్టి, ఏ దశలో కూడా శతృవుతో రాజీపడకుండా ఆంగేయ బలగాలతో తలపడిన రాణులు చరిత్రలో అరుదుగా కన్పిస్తారు. అటువంటి అరుదైన ఆడపడుచులలో అగ్రగణ్యురాలు బేగం హజరత్‌ మహల్‌.

ఆమె ఉత్తర భారతదేశంలోని అత్యంత సంపన్నవంతమైన అవధ్‌ రాజ్యం అధినేత నవాబ్‌ వాజిద్‌ అలీషా భార్య. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫైజాబాద్‌. ఆమె చిన్నప్పటి పేరు ముహ్మది ఖానం. ఆమె అందచందాల గురించి విన్న వాజిద్‌ అలీ షా ముగ్దుడై ఆమెను ఏరి కోరి మరీ వివాహమాడారు. వివాహం తరు వాత ఆమె ఇఫకారున్నీసా బేగం, ఆ తరువాత హజరత్‌ మహల్‌ అయ్యారు. ఆ దంపతులకు మీర్జా బిర్జిస్‌ ఖదిర్‌ బహుదూర్‌ అను కుమారుడు కలిగాడు.

1856 ఫిబ్రవరి 13న నవాబ్‌ వాజిద్‌ అలీషాను ఆంగ్లేయులు నిర్భందించి, మార్చి 13న కలకత్తా పంపి అక్రమంగా అవద్ ను ఆక్రమించుకున్నారు.ఈ చర్య వలన ప్రజలలో తీవ్ర అసంతృప్తి రగులుకుంది. ఆ అసంతృప్తికి ఆలంబనగా బేగం హజరత్‌ మహల్‌ నిలబడ్డారు. ఆమెకు అండదండలుగా ప్రజలు, కులమతాల ప్రసక్తి లేకుండా స్వదేశీ యోధు లు, వివిధ ప్రాంతాల పాలకులు నడిచారు.1857 మే 31న అవధ్‌ రాజ్యం రాజధాని

చిరస్మ రణీయులు