పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

57

20. ఖాన్‌ బహదూర్ ఖాన్‌

(1787- 1860)

మాతృభూమిని పరాయి పాలకుల కబందహస్తాల నుండి విముక్తం చేసేందుకు తిరుగుబాటు శంఖారావం పూరించి, హిందూ-ముస్లిం ఐక్యసంఘటనతో స్వతంత్ర పాలన ఏర్పాటు చేసి, స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న స్వదేశీ పాలకులలో రొహిల్‌ఖండ్‌ అధినేత ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ది ప్రత్యేక స్థానం.

ఆనాడు హిందూ-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలచిన ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌ 1787లో జన్మించారు. బ్రిటిషర్లు కల్పించిన అధికార పదవిని వదులుకొని సుమారు 70 సంవత్సరాల వయస్కుడైన ఖాన్‌సాబ్‌ రణరంగ ప్రవేశం చేసి, 1857 మే 31న రోహిల్‌ఖండ్‌ రాజధాని బరేలిలో స్వతంత్ర బావుటాను ఎగురవశారు. రొహిల్‌ ఖండ్‌లోని ప్రజానీకమంతా ఏకమై ఖాన్‌ నాయకత్వంలో స్వతంత్ర పాలనకు ప్రాణ ప్రతిష్ట చేసి కంపెనీ పాలకులు, అధికారులను నట్టికరిపించారు.

ఈ సందార్భంగా రోహిల్‌ ఖండ్‌ ప్రజలను ఉద్దేశించి ఖాన్‌ బహదాూర్‌ మ్లాడుతూ భారతదేశ ప్రజల్లారా! అని సంబోధించటం చరిత్ర సృష్టించింది. మన పవిత్ర సాfiతంత్య్ర దినోత్సవం ఉదాయించింది. ఇంగ్లీషు వారు మోసాలకు పాల్పడవచ్చు. ముస్లింలకు వ్యతిరేకంగా హిందాువులనూ, హిందాువులకు వ్యతిరేకంగా ముస్లింలనూ రెచ్చగొడతారు. చిరస్మ రణయులు: