పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

53

18. అజీముల్లా ఖాన్‌

(1834- 1859)

స్వదేశీ పాలకులు, సంస్థానాథీశులు బ్రిటిష్‌ పాలకులపై మండిపడుతున్న రోజుల్లో శక్తి కంటే యుక్తి మంచి ఫలితాలనిస్తుందని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆంగ్లేయ మేధావులకు ఏ మాత్రం తీసిపోని విధంగా 1857నాటి పోరాటాలకు వ్యూహరచన చేసిన మేధావులలో ఒకరుగా అజీముల్లా ఖాన్‌ ఖ్యాతిగాంచారు.

1834లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జన్మించిన అజీముల్లా బాల్యం తన తల్లి ఆయాగా పనిచేసే అనాథ శరణాలయంలో గడిచింది. తొలిరోజుల్లో ఒక ఆంగ్లేయుని ఇంట పనివాడిగా చేరి పొట్టగడుపుకుంటూ కాలం గడిపిన ఆయన ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలను నేర్చుకున్నారు. ఆ భాషల మీద పట్టు లభించాక, ఆంగ్లేయుల ప్రవృత్తి తెలిశాక ఆయన వారి సేవకు తిలోదకాలిచ్చారు. ఆ తరువాత కాన్పూరు విద్యాలయంలో విద్యార్థ్ధిగా చేరి, తన అసాధారణ ప్రతిభ వల్ల అదే విద్యాలయం అధ్యాపకుడయ్యారు.

ప్రబుత్వ విద్యాలయంలో అద్యాపకుడిగా అజీముల్లా పనిచేస్తుండగా అయన ప్రతిభ గురించి విన్న కాన్పూరు అధినేత నానా సాహెబ్‌ పీష్వా ఆయనను తన పక్షాన వకీలుగా బాధ్యతలు నిర్వహించేందుకు ఆహ్వానించాడు. నానా పక్షాన వాదించేందుకు అజీముల్లా ఇంగ్లాండు వెళ్ళి అక్కడ రెండేళ్ళు గడిపారు. ఆ సందర్భంగా బ్రిటిషర్ల రాజకీయాలను,

చిరస్మ రణీయులు