పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45

14. ముందర్

( - 1858)

1857 నాటి సంగ్రామంలో మాతృభూమిని బ్రిటిషు పాలకుల నుండి విముక్తి చేయడానికి ప్రజలు కులమతాలకు అతీతంగా పోరులో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలోని స్వదేశీ పాలకుల పక్షాన తిరుగుబాటు చేసిన యోధులు తమ ధానమాన ప్రాణాలను పణంగా పెట్టి నాయకుల వెంట నడిచారు. ఆ విధంగా స్వదేశీ పాలకులతో కలసి తిరుగుబాటులో పాల్గొని అమరత్వం పొందిన ముస్లిం యువతులలోముందార్‌ ఒకరు.

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వెన్నంటి నిలచి శత్రువుతో పోరాడిన సాహస యువతి ముందార్‌. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర వహించిన రఝాన్సీ రాణి లక్ష్మీబాయి అమరత్వం పొందిన తీరు గురించి ప్రధానంగా రెండు కథనాలు ఉన్నాయి. ఆ కథానాలలో ఒకటి రాణి లక్ష్మీబాయి బ్రిటిషర్ల తుపాకి గుండ్లకు బలైందన్నది. ఈ విషయాన్నిచాలామంది చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఆ కదనం ప్రకారంగా ఝాన్సీరాణి లక్ష్మీబాయికి అంగరక్షకుల్లా ఇరువురు యువతులు మగ వేషాల్లో ఆమెను ఎల్లప్పుడూ వెన్నంటిఉండేవారు. ఆ ఇద్దరిలో ఒకరు ముందార్‌. ఆమె రాణితో పాటు బ్రిటిష్‌ సైనికాధికారుల తుపాకి గుళ్ళకు బలయ్యారు.

చిరస్మ రణయులు