పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43

13. బేగం అజీజున్‌

(1832-1858)

స్వప్రయోజనాలను ఆశించకుండా మాతృభూమి మీదగల ప్రేమాభిమానాలతో మాత్రమే తమ ధాన, మాన, ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఆంగ్లేయ సైన్యాలతో పోరాడుతూ అమరత్వం పొందిన సామాన్యులలో అసామాన్యురాలుగా ఖ్యాతిగాంచిన యోషురాలు బేగం అజీజున్‌.

1832లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బితూర్‌లో జన్మించిన అజీజున్‌ తండ్రి హసీన్‌ ఖాన్‌, తల్లి హమీదా బాను. అజీజున్‌ మంచి రూపసి. ప్రసద్ధనర్తకి ఉమ్రావ్‌జాన్‌ బృందంలో చేరి నాట్యంలో మంచి అభినివేశాన్ని సాధించిన ఆమెకు స్వజనం మీద పెత్తనం సాగిసున్న ఆంగ్లేయులంటే పరమ ద్వేషం. బ్రిటిష్‌ సైన్యంలో సుబేదారుగా పనిచేస్తున్న షంషుద్దీన్‌ పరాయి ప్రభుల కొలువు నుండి తొలిగి కాన్పూరు పాలకుడు నానా సాహెబ్‌ పక్షంలో చేరేంత వరకు ఆయన స్నేహాన్ని అంగీకరించని దేశభక్తి ఆమెది.

మహాయోధుడు నానా సాహెబ్‌ పీష్వా అంటే అజీజున్‌కు భక్తి, గౌరవం. స్వదేశీ సంస్థానాలను అక్రమంగా ఆక్రమించుకుంటున్న ఆంగ్ల పాలకులంటే అసహ్యం. ఆ అసహ్యత నుండి పరదేశీయులు సాగిస్తున్న అధర్మాన్ని, అన్యాయాన్ని ఎదుర్కోవాలన్న ప్రగాఢవాంఛ ఆమెలో అంకురించింది. ఆ కోర్కె మరింతగా బలపడి 1857 జూన్‌ 7న

చిరస్మ రణయులు