పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

స్వదేశీయుల పాలన తిరిగి నెలకొనబడుతుందని, తిరుగుబాటు సిద్దం కావాలని సందేశాలు పంపారు. ఈ తిరుగుబాటుకు రాష్ట్రంలో హిందూ- ముస్లింలు కలిసి జరుపుకునే మొహర్రం పండుగ రోజైన 1857 ఆగస్టు 28ని ముప˙ర్తంగా నిర్ణయించారు.

ఈ మేరకు 30వ పటాలానికి చెందిన హిందూ-ముస్లిం సిపాయీలు: హవల్దార్‌ వరదరాజులు, లాన్స్‌నాయక్‌ పరుశురాం, సిపాయి వీరాస్వామి, దలాయత్‌ యల్లప్ప, సుబేదార్‌ మేజర్‌ మహమ్మద్‌ అష్రాఫ్, దలాయత్‌ సత్యాజీ, జమేదార్‌ సి.జగ్గయ్య, హవల్దార్‌ మహమ్మద్‌ గౌస్‌, మౌల్వీ అబ్దుల్‌ అజీజ్‌ హుస్సేన్‌లను సంసిద్ధం చేశారు. తిరుగుబాటు ముహర్తాన్నిపెట్టి ఒక్కమ్మడిగా ఆంగ్లేయాధికారుల మీద విరుచుకు పడాలని సహచరు లకు సూచిస్తూ పథకం సిద్ధం చేశారు.

ఈ పథకం అమలు జరిగేలోపున ఆ విషయాన్ని గూఢచారుల ద్వారా పసికట్టిన ఆంగ్లేయాధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. షేక్‌ పీర్‌ షాతో తిరుగుబాటు ఆలోచనలను పంచుకున్నాస్వదేశీ సైనికుల మీద కన్నేసి, వారిలో ఒకరిని నయానా భయాన నచ్చ చెప్పి, లంచమిచ్చి రహస్య మంతనాల సారాంశాన్ని పూర్తిగా రాబట్టారు. ఆ సమాచారంతో తిరుగుబాటుకు కుట్ర జరుగుతుందన్నవిషయం తెలియగానే కంగారుపడిన ఈస్ట్‌ ఇండియా సైనికాధికారులు అప్రమత్తులయ్యారు. ఈ తిరుగుబాటు పథాకాన్ని రూపొందించింది ఒక గ్రామీణుడని, మతప్రసక్తి లేకుండా స్వదేశీ సైనికులను ఏకం చేసి తిరుగుబాటును దాదాపు విజయవంతం చేయగల స్థాయికి చేర్చిన ఆ వ్యక్తి పుట్టు అంధుడని తెలుసుకున్న ఆంగ్లేయాధికారులు నివ్వెరపోయారు. ఆఘమేఘాల మీద బలగాలతో బయలుదేరి వచ్చి షేక్‌ పీర్‌ షాను అరెస్టు చేశారు.

ఆ తరువాత తిరుగుబాటుకు సన్నద్దులైన వారందర్నిఅదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు కుట్రను పన్నారన్న నేరారోపణతో షేక్‌ పీర్‌ షా మీద విచారణ జరిపారు. ఆ సందర్భంగా షేక్‌ పీర్‌ షా గురించి ప్రస్తావిస్తూ- He effects to be blind, whether so or not, his other senses are evidently keen, and I therefore deem it my duty to sentence the Prisioner Shaik Peer Shah to 10 years' imprisonment, with hard labour in Irons'(The Freedom Struggle in Andhra Pradesh (Andhra), Volume I, Govt. of AP, Hyderabad,1997,Page.161-163)అని వ్యాఖ్యానిస్తూ 10 సంవత్సరాల కఠిన కారాగారశిక్షను విధించారు. ఆ తీర్పు మేరకు షేక్‌ పీర్‌ షాను కడప జైలు నుండి మధుర లేక తిరుంవేలి జైలుకు తరలించారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌