పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41

12. షేక్‌ పీర్‌ షా

(- )

పరాయి పాలన స్థానంలో స్వదేశీయుల పాలనను స్థిరంచేయాలన్న ఆకాంక్షబలంగా ఉన్నట్టయితే ఏ అంగవైకల్యం కూడా అటువంటి స్థిరచిత్తులను అశక్తుల్నిచేయలేదని నిరూపించి చరిత్రలో ప్రత్యేక ఆధ్యాయాన్ని సృష్టించుకున్న యోధుడు షేక్‌ పీర్‌ షా.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప జిల్లా పూర్వపు సిద్దవట్టం తాలూకా యల్లంపేట గ్రామ నివాసి షేక్‌ పీర్‌ షా. ఆయన పుట్టుకతో అంధులు. 1857లో ఆరంభమై న తిరుగుబాటులో భాగంగా పరాయిపాలకులను వెళ్ళగ్టొాలన్న దృఢసంకల్పంతో ముందుకు సాగారు. ఆ పథకంలో భాగంగా కడపకు 20 మైళ్ళ దూరంలో ఉన్న కడప చేరుకున్నారు. కడపలోని స్థానికులతో, ప్రభుత్వసైన్యాగారానికి చెందిన 30వ పటాలంలోని స్వదేశీ సిపాయిలతో షేక్‌ పీర్‌ షా సంబంధాలు ఏర్పర్చుకున్నారు.

ఈ సందర్బంగా హిందూ-ముస్లింల మతమనోభావాల ను అగౌరవపర్చేలా కంపెనీ సైనికాధికారుల చర్యలను వివరిస్తూ స్వదేశీ సైనికులలో బ్రిటిషు సైనికాధికారుల పట్ల వ్యతిరేకభావనలను ప్రోదిచేశారు. ఈ సందర్భంగా ఆంగ్లేయులకు మద్దతు పలుకుతున్న నైజాం నవాబు చర్యలనుకూడా ఆయన నిశితంగా విమర్శించారు.

1857లో ప్రథమ స్వాతంత్య్ర సమరం ఆరంభం కాగానే స్వదేశాభిమానం గల యోధులను పూర్తిగా తిరుగుబాటుకు ప్రేరేపిస్తూ, ఆంగ్లేయ ప్రభుత్వం కూలిపోతుందని,

చిరస్మ రణయులు