పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. సర్దార్‌ హిక్మతుల్లా ఖాన్‌

( - 1857)

స్వదేశీ పాలకులూ, ప్రజలు మాత్రమే కాకుండా ఈస్ట్‌ ఇండియా కంపెనీలోని ఉన్నతాధికారులు కూడా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. మాతృభూమి మీదఉన్నప్రేమతో ఆయుధం పట్టి ముందుకు సాగిన అలనాటి యోధానుయోధులలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉన్నతాధికారి అయిన సర్దార్‌ హిక్మతుల్లా ఖాన్‌ ప్రముఖులు.

1857లో ఉత్తర పదశ్‌ రాష్ట్రంలోని ఫతేపూర్‌ జిల్లాకు డిప్యూటీ కలక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు హిక్మతుల్లా ఖాన్‌. స్వదేశీయుల మత సంబంధిత వ్యవహారాలలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారుల జోక్యాన్ని వ్యతిరేకించిన ఆయన 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ప్రజ్వరిల్లగానే డిప్యూటీ కలక్తర్‌ పదవిని త్యజించి కంపెనీ పాలకుల తరిమివేతకు 1857 జూన్‌ 10న సమర శంఖారావం పూరించారు.

ఈ ప్రతికూల పరిస్థితులకు దిమ్మెర పోయిన కంపెనీ ప్రభుత్వం తేరుకొనేలోపు ఫతేపూర్‌ను ఆధీనంలోకి తెచ్చుకుని కంపెనీ జైళ్ళ లోని ప్రజలను విడుదల చేసి, ఖజానాలోని తొమ్మిది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని స్వతంత్ర పాలనకు అంకురార్పణ చేశారు. సర్దార్‌ హిక్మతుల్లాకు దారియాన్‌సింగ్, శివదాయాల్‌సింగ్, బాబా గయాదిన్‌ దుబే, మౌల్వీ లియాఖత్‌ ఆలీ, మౌల్వీఅహ్మదుల్లా, జనరల్‌ తిక్కా సింగ్, జ్వాలా ప్రసాద్‌ లాంటి