పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

31

7. టిటూ మీర్‌

(1782-1832)

భారతావనిలో వలసవాదుల పాలన ప్రారంభమైన నాటినుండి బ్రిటిష్‌ శక్తులకు వ్యతిరేకంగా పలు తిరుగుబాట్లు జరిగాయి. ఈ పోరాటాల చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన వహాబి ఉద్యమానికి సమరశీలత జోడించి, చివరకు స్వాతంత్య్ర సమరంలో భాగంగా సాగిన పలు పోరాటాలకు ప్రేరణగా నిలచిన కార్యశారులు టిటూ మీర్‌.

బెంగాల్‌లోని నర్కేల్‌బరియా ప్రాంతంలోని హెదర్ పూర్‌ లేక చాంద్‌పూర్‌ లో 1782లో టిటూమీర్‌ జన్మించారు. తల్లి పేరు రొఖయాబి. తండ్రి పేరు మీర్‌ నిస్సార్‌ అలీ. సన్నకారు రైతు కుటుంబం. చిన్నతనంలో వస్తాదుగా పేర్గాంచిన ఆయన కుస్తీ పోటీలలో పాల్గొంటు మంచి వస్తాదు గా ఖ్యాతిగడించారు. పలు చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు.1823 ప్రాంతంలో మక్కాను సందర్శించిన ఆయన ఇండియాలో వహబి ఉద్యమ వ్యవస్థాపకు లు సయ్యద్‌ అహమ్మద్‌ బరేల్వీని, ఫరాజి ఉద్యమ నిర్మాత హాజీ షరియతుల్లాను మక్కాలో కలిశారు. ఈ ముగ్గురు నాయకుల కలయిక బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వహాబీ- ఫరాజీ ఉద్యమ స్రవంతులు పోరుబాటన ఉదృతంగా సాగటానికి ఉపయోగపడింది.

మక్కా నుండి తిరిగి వచ్చాక నర్కేల్‌బరియా దగ్గర గల హైదర్‌పూరులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని, ధార్మిక ప్రచారం కోసం పర్యటనలు గావించిన టిటూ మీర్‌ ఈస్ట్‌

చిరస్మ రణయులు