పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5.టిపూ సుల్తాన్‌

(1750-1799)

ఉత్తర భారతాన్ని హస్తగతం చేసు కున్నఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు, దక్షిణాదిని ఆక్రమించుకోవటానికి కుట్రలు, కుయుక్తులు పన్నుతున్న సందర్భంగా సామ్రాజ్యవాద శక్తుల రాజ్యవిసరణ కాంక్షను బహిర్గతం చేస్తూ స్వదేశీయులను ఏకం కమ్మని పిలుపునిచ్చిన దార్శనికుడు, మైసూరు పులిగా ఖ్యాతిగాంచిన టిపూ సుల్తాన్‌.

1750 నవంబర్‌ 10న కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ జిల్లా దేవనహళ్ళి గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి హెదర్‌ అలీ, తల్లి శ్రీమతి ఫాతిమా ఫక్రున్నీసా. చిన్నతనంలోనే యుద్ధకళను ఔపోసన పట్టినటిపూ తండ్రితోపాటుగా యుద్ధరంగంలో ప్రవేశించ ఆసక్తిచూపారు. ఆ క్రమంలో 1769-72 వరకు మరాఠాలతో హైదర్‌ అలీ సాగించిన యుద్ధాలలో పాల్గొని, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు.

1782 డిసెంబరు 7న యుద్దబూమిలో తండ్రి హైదర్‌ అలీ కన్నుమూయగా టిపూ మైసూరు రాజ్యలక్ష్మిని చేబట్టి టిపూ సుల్తాన్‌ అయ్యారు. ఆ రోజున టిపూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, 'మిమ్మల్ని వ్యతిరేకించినట్టయితే నేను నాస్వర్గాన్నీ, నాజీవితాన్నీ, నా సంతోషాన్నీ కోల్పోవచ్చు. ప్రజల సంతోషం లోనే నాసంతోషం. నా ప్రజల సంక్షేమం లోనే నా సంక్షేమం ఇమిడి ఉంది. నాకిష్టమైందల్లా మంచిదని నేను భావించను. నా

చిరస్మ రణయులు