పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23

3. హైదర్‌ అలీ ఖాన్‌

(1722-1782)

రాజ్యవిస్తరణ కాంక్షతో రగిలిపోతున్న పరాయిపాలకుల పన్నాగాలను గ్రహించి ఆ శక్తులకు, ఆ శక్తుల తొత్తులకు వ్యతిరేకంగా జీవిత చరమాంకం వరకు పోరాడి 'అరివీర భయంకరుడు'గా విశ్వరూపం చూపిన మొనగాడు హైదర్‌ అలీ ఖాన్‌.

దక్షిణ భారతదేశ నెపోలియన్‌ గా ఖ్యాతిగడించిన హైదర్‌ అలీ 1722లో కర్నాటక రాష్రం దేవనహళ్లి గ్రామంలో జన్మించారు. తండ్రి ఫతే మొహమ్మద్‌ అలీ, తల్లి మజిదాన్‌ బేగం. చిన్నతనం నుండి యుద్ధ విద్యల పట్ల ఆసక్తి చూపిన హైదర్‌ అలీ ఆయా విద్యలలో మంచి ప్రావీణ్యత సంపాదించారు. విద్యాగంధం లేకపోయినా, ఆయనకు కుశాగ్రబుద్ది, అసమాన ధారణశక్తి, ధాఢ సంకల్పం, పలు పనులను ఏకకాలంలో నిర్వహించగల సామర్ధ్యం, కార్యదక్షత, ధైర్యసాహసాలు సహజ లక్షణాలయ్యాయి.

1749లో జరిగిన దేవనహళ్లి ముట్టడిలో పాల్గొన్న యువకుడు హైదర్‌ అలీ ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ముగ్దుడైన మైసూరు రాజ్య మంత్రి నంజరాజ్‌ ఆయనను 'ఖాన్‌' బిరుదుతో సత్కరించి, చిన్న సైనికదళం నాయకుడ్ని చేశాడు. ఆక్కడి నుండి 1758లో సర్వసెన్యాధిపతిగా ఎదిగి 1761నాటికి హెదర్‌ అలీ మైసూరు పాలకులయ్యారు. ఆ అనూహ్య ఎదుగుదల నచ్చని మరాఠాలు, నైజాం నవాబు, పరాయి పాలకులైన

చిరస్మ రణయులు