పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. బెంగాలు నవాబు సిరాజుద్దౌలా

(1733- 1757)

ఆంగ్లేయుల కుయుక్తులను ఆరంభంలోనే గ్రహించి వారి దుర్మార్గాన్నిఅరికట్టేందుకు ఉపక్రమించి, 'భారత స్వాతంత్య్ర సాయుధ సమరేతిహాసంలో అరుణపుటల్నితెరిచిన' పాతికేళ్ళు దాటని యోధుడు, బెంగాలు నవాబు సిరాజుద్దౌలా.

1733లో సిరాజుద్దౌలా జన్మించారు. తల్లి అమీనా బేగం, తాత బెంగాలు నవాబు అల్లావర్దీ ఖాన్‌. తాత నుండి సిరాజ్‌కు ముషిరాబాద్‌ రాజధానిగా గల బెంగాలు రాజ్యం లభించింది. ఆయన రాజ్యాభిషేకం ఇష్టంలేని శక్తులు ఆరంభం నుండే కుట్రలు చేయడం ఆరంభించాయి. ఆ అనుకూల పరిస్థితులను గ్రహించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు నవాబు అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ప్రజలను, వర్తక- వ్యాపారులను, రైతులను దోచుకోవటం ప్రారంభిచేసరికి నవాబు సిరాజ్‌ మండిపడ్డారు. కంపెనీ దుశ్చర్యలను అరికట్టేందుకు పూనుకున్నారు. ఆ ప్రయత్నాల తొలి దశలో ఆయన విజయం సాధించినా, ఆయనలోని శతృవును క్షమించే ఔదార్యం ఆ తరువాత ఆయనకు మాత్రమే కాక భారతదేశ భవిష్యత్తుకు ప్రమాదకరంగా పరిగణించింది.

ఈ వాతావరణంలో సిరాజ్‌ పెద్దమ్మ ఘాసిటీ బేగం, ఆమె దత్తకుమారుడు షౌకత్‌ జంగ్, ఆయన మద్దతుదారుడు దివాన్‌ రాజ్‌ వల్లభ్‌ కుమారుడు కృష్ణదాసు, సిరాజ్‌