పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

216

1940లో ఆరంభమైన శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో ఆయన ఉద్యోగం వదిలేసి జాతీయోద్యమంలో ప్రవేశించారు. మాతృదేశసేవలో పూర్తిగా గడపాలని నిర్ణయించుకున్న ఆయన వ్యక్తిగత స్వార్థం, కుటుంబ బంధనాలకు దూరంగా ఉండాలని అవివాహితునిగా ఉండిపోయారు. మహాత్ముని మార్గంలో స్వయంగా నూలును వడికి అవసరమైన బట్టలను తయారు చేసు కుని వాటిని ధరించటం ప్రారంభించారు. ముస్లిమేతర ప్రజానీకం మత మనోభావాలకు విఘాతం కలగకుండేందుకు గోమాంసం తినడం మానేశారు. శాసనోల్లంఘన ఉద్యామంలో పాల్గొన్నందుకు ఆగ్రహించిన ప్రభుత్వం సంవత్సరం జైలు శిక్షను విధించి రావల్పిండి జైలుకు పంపింది.1942నాటి క్విట్ఇండియా ఉద్యమంలో చురుగ్గా పనిచేసనందుకు మరోమారు 22 మాసాల జెలుశిక్ష అనుభవించారు. ఆ సందర్బంగా జైలులో ఖైదీలు అనుభవిస్తున్నదుర్బర పరిస్థితుల నుండి వారిని విముక్తం చేసేందుకు సత్యాగ్రహం చేపట్టి విజయం సాధించారు.

1947లో స్వరాజ్యం సిద్ధించింది. ఆ ఆనందంలో ఎంతో సేపు నిలువలేదు. మత కలహాలు, భారత విభజన ఆయనను కలచివేశాయి. ఆనాటి కల్లోల సమయంలో మీర్‌ ముష్టాఖ్‌ అహమ్మద్‌ డిల్లీలో ప్రత్యే క మేజిస్ట్రీట్ గా కులమతాల ప్రసక్తి లేకుండా సమన్యాయం ప్రసాదించడంలో, మతసామరస్యం కాపాడటంలో కీలకపాత్ర నిర్వహించారు.

చిన్నతనం నుండి సామాజిక న్యాయం లక్ష్యంగా ఎదిగిన మీర్‌ ముష్టాఖ్‌ అహమ్మద్‌ సామ్యవాద భావాల వైపు మొగ్గుచూపుతూ కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ స్థాపనలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ పార్టీ పక్షాన ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి బాధ్యతాయుతంగా పనిచేశారు. ఆ తరువాత పలు పదవులు చేపట్టి నిర్వహించారు. ఇందిరా గాంధీ ఎమర్జన్సీని ప్రకటించినందుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీని విడిచిపెట్టారు. అత్యయకపరిస్థితిని తీవ్రంగా విమర్శించి ప్రభుత్వాధినేతల ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత మరో పార్టీలో చేరకుండ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, భాషా-సంస్కతుల పరిరక్షణ కోసం, మత సామరస్యాన్ని కాపాడేందుకు మహాత్ముని బాటలో చివరికంటా సాగారు.

కవి-రచయితగా, చక్క ని కవితలు-రచనలతో ఉదాత్త భావనలను వెలడంచిన ఆయన సాహిత్యరంగంలో కూడ మంచి గుర్తింపు పొందారు. బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో ఆయన పాల్గొన్నా, వ్యక్తిగతంగా వారిపట్ల ఎటువంటి శత్రువైఖరిని అవలంభించ లేదు. మంచిని మంచిగా చెడును చెడుగా చూడాలంటూ ప్రజాజీవితాలలో గుణాత్మక మార్పులకు ఆంగ్లపాలకులు ఏవిధంగా తోడ్పడింది సాధికారికంగా వివరిస్తూ తన రచనలలో మీర్‌ ముష్టాఖ్‌ అహమ్మద్‌ ధన్యవాదాలు తెలిపారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌