పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

215

99. మీర్‌ ముష్టాఖ్‌ అహమ్మద్‌

(1915 - )

జాతీయోద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించిన యోధులు సామాజిక న్యాయం ప్రాతిపదికన మహాత్ముని బాటలో నవభారత నిర్మాణం జరగాలని కూడా ఆకాంక్షించారు. ఆ ఆకాంక్షల సాధన దిశగా జాతీయోద్యమ కార్యకలాపాలతోపాటుగా నవభారత నిర్మాణ కార్యక్రమాలను జమిలిగా సాగించిన వారిలో మీర్‌ ముష్టాఖ్‌ అహమ్మద్‌ ప్రముఖులు.

1915 ఏప్రిల్‌ 25న జమ్మూకాశ్మీర్‌లోని సిమ్లాలో ఆయన జన్మించారు. జాతీయ భావాలు గల ఆయన తండ్రి మీర్‌ అబ్దుల్‌ సత్తార్‌ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్నందున 1921లో అరెస్టయ్యారు. ఆ వారసత్వాన్ని కొనసాగించిన మీర్‌ ముష్టాఖ్‌ అహమ్మద్‌ విద్యార్థిగా నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి 1938లో కళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదార్శిగా ఎన్నికయ్యారు.

ఒకవైపు కళాశాల విద్యార్థి సంఘం నేతగా బాధ్యాతలు నిర్వహిస్తూనే, నూతనంగా ఏర్పడిన All India Students Federation సభ్యత్వం స్వీకరించి విద్యార్థి ఉద్యమాలలో చురుకైన పాత్ర నిర్వహించారు. ఆ సమయంలో జవహర్‌లాల్‌ నెహ్రూ˙, సరోజిని దేవి, మహమ్మద్‌ అలీ జిన్నా, యన్‌.జి.రంగా, బబ్లూభాయ్‌దేశాయి, మౌలానా అతావుల్లా బొఖారి తదితర ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

చిరస్మరణీయులు