పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

211

97. అమీర్‌ హైదర్‌ ఖాన్‌

(1900-1999)

బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులను పారద్రోలడం మాత్రమే కాకుండా సామ్యవాద వ్యవస్థను నిర్మించాలన్న లక్ష్యంతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని దక్షిణ భారత దేశానికి పరిచయం చేసిన అసమాన పోరాట యోధులు అమీర్‌ హైదర్‌ ఖాన్‌.

ఈనాటి పాకిస్థాన్‌లో భాగమైన పశ్చిమ పంజాబ్‌ రాష్ట్రంలోని కలియన్‌ వలియన్‌ గ్రామంలోని ఒక సామాన్య రైతు కుటుంబాన 1900లో అమీర్‌ హెదర్‌ ఖాన్‌ జన్మించారు. జాతీయోద్యమంలో పాల్గొనడానికి ఇల్లు వదలి పెట్టి వెళ్ళిన పెద్దన్నను వెతుక్కుంటూ బయలు దేరిన హైదర్‌ ఖాన్‌ బొంబాయి చేరుకుని 15 ఏండ్ల వయస్సులో అక్కడ నుండి ఓ నౌకలో కూలివానిగా లండన్‌ ప్రయాణమయ్యారు. ఆ నౌకలో తోి పిల్లలకు కూలి విషయంలో జరుగుతున్నఅన్యాయాన్ని ప్రశ్నించి విజయం సాధించిన ఆయన ఆ తరువాత జీవిత పర్యంతం శ్రమజీవుల పక్షం వహించి పోరుబాట సాగారు.

అమీర్‌ హైదర్‌ ఖాన్‌ పలు ఉద్యోగాలు చేస్తూ వివిధ ప్రాంతాలు తిరుగుతుండగా 1919లో న్యూయార్క్‌లో ఆయనకు గదర్‌ పార్టీతో పరిచయం కలిగింది. ఆ పరిచయం తరువాత అమెరికాలోని భారత స్వాతంత్య్ర మిత్రమండలిలో చేరి చురుగ్గా పనిచేయడం, జపాన్‌లో ఉన్న విప్లవకారుడు రాస్‌ బిహారి బోస్‌ను కలిసి విప్లవ కార్యక్రమాల గురించి

చిరస్మ రణయులు