పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

209

96. నక్కీ అహమ్మద్‌ చౌదరి

(1914- 1996)

నేతాజి సుభాష్‌ చంద్రాబోస్‌ నాయకత్వంలో ఆయుధం చేతపట్టి రణనినాదం చేస్తూ బ్రిటిషర్లను ఎదుర్కొన్న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సభ్యునిగా పలు పోరాటాలలో పాల్గొని కార్యదక్షత, నిరుపమాన దేశభక్తిని నిరూపించుకున్న యోధులు నక్కీ అహమ్మద్‌ చౌదరి.

మణిపూర్‌ రాష్ట్రం తూర్పు ఇంఫాలాలోని కెకూహ్‌ ( KEIKHU) గ్రామంలోని మౌల్వీ అమీరుల్లా, బీబి ఖతిజా అలియాస్‌ హోమ్‌బి బీబీ (HAOTOMBI BIBI) లకు నాల్గవ సంతానంగా నక్కీ అహమ్మద్‌ చౌదరి 1914 డిసెంబర్‌ 25న జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్‌ పరిక్ష పాసయ్యాక మణిపూర్‌లో కళాశాల లేకపోవడంతో విద్యాభ్యాసాన్ని ముగించారు. చిన్ననాటి నుండే సమాజసేవాభావనలను పుణికి పుచ్చుకున్న ఆయన నిఖిల్‌ మణిపూర్‌ మహాసభ (NIKHIL MANIPUR MAHASABHA) సభ్యత్వం స్వీకరించి సంఘసేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు.

1939లో పరాయి పాలకుల తొత్తులు సాగించిన దోపిడి-దౌరన్యాలకు వ్యతిరేకంగా మణిపూరు మహిళలు సాగించిన మేయిటై మహిళా తిరుగుబాటులో ( MEITEI WOMEN'S REVOLT) లో ఆయన చురుకైన పాత్ర నిర్వహించారు. మౌల్వీ రహిముద్దీన్‌ సాహెబ్‌, మౌల్వీ హుసైన్‌ అలీ సాహెబ్‌ల మారదర్శకత్వంలో సాగిన ఈ తిరుగుబాటులో మణిపూరి

చిరస్మరణీయులు