పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

అందరికి ఆదర్శంగా నిలవడం తెనాలి లోని ముస్లిం లీగ్ నేతలకు కార్యకర్తలకు, లీగ్ అభిమానులకు ఇష్టం లేకపోయింది. ఆ కారణంగా ఆ దమ్పతులు ముఖ్యంగా హజరా బీబి చాలా అవస్థలు ఎదాుర్కోవాల్సి వచ్చింది. అత్యంత క్లిష్టపరిసితులు ఎదురైనా హాజరా బీబి ఎంతో ఓర్పుతో కుటుంబ వ్యవహారాలను చూసుకుంటూ, తన ఇంటికి విచ్చేస్తున్న జాతీయోద్యమ నాయకులకు, కార్యకర్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ఇస్మాయిల్‌కు అండగా జాతీయోద్యమంలో ముందుకు సాగారు.

భర్త ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ పలుసార్లు జైలు పాలెనప్పటికీ హాజరా అధర్యపడలేదు . మహాత్ముని మాటలతో ప్రభావితమైన కార్యకర్తగా తన భర్త జైలుకు వెళ్ళటం గౌరవంగా భావించారు. పిల్లలకు జాతీయవిద్యను అందించాలన్న లక్ష్యంతో స్వసమాజం నుండి వ్యతిరేకత వ్యకమవుతున్నా, ఆడబిడ్డలను జాతీయ విద్యాబోధన కోసం హిందీ పాఠశాలకు పంపారు. ఈ పద్ధతులు నచ్చని వ్యక్తులు ఇస్మాయిల్‌ కుటుంబం మీద అప్రకటిత సాంఘక బహిష్కరణ విధించారు. ఆమె ఇంటికి ఎవ్వరూ వెళ్ళ రాదని, పలకరింపు కూడా కూడదని ఆంక్షలు విధించారు. ఆ చర్యలకు ఏ మాత్రం చలించకుండా ఎంతో సహనం, గౌరవంగా ఆమె వ్యతిరేక పరిస్థితులను నెట్టుకొచ్చారు. తమ మార్గం గాంధీ మార్గం కనుక ఎవరు ఏమనుకుమన్నా, ఏమి చేసినా ఓర్పు, సహనంతో పరిష్కరించుకోవడం తప్ప గాంధీమార్గం నుండి మళ్ళేది లేదని నిర్ణయించుకున్న హజరా బీబి, ఆ నిర్ణయం ప్రకారంగా చివరికంటా పయనం సాగించారు.

భర్త ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ మొత్తం మీద ఏడు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించారు. ఆయన చివరిసారిగా జైలులో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యం పాలై 1948లో కన్నుమూశారు. ఆయన కన్నుమూశాక స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే భూమిని ప్రభుత్వం ఆమెకు సంక్రమించ చేయదలచింది. అయితే తమ దేశభక్తికి విలువ కట్టడం ఇష్టంలేని ఆమె ప్రభుత్వం ఇస్తానన్న భూమిని తిరస్కరించారు. ప్రబుత్వం ఇస్తానన్నభూమిని తిరస్క రించడం మాత్రమే కాకుండా తన భర్త వాగ్దానం మేరకు తెనాలి సమీపాన గల కావూరు వినయాశ్రమానికి తమ విలువైన రెండున్నర ఎకరాల మాగాణి భూమిని ఆమె దానం చేసి భర్త వాగ్దానాన్ని గౌరవించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆనాడు స్వాతంత్య్రయోధుల సమావేశస్థలిగా భాసిల్లిన ఖద్దరు విక్రయ శాల ను ఇస్మాయిల్‌ మరణానంతరం కూడాకొంతకాలం నిర్వహించారు. చివరివరకు ఖద్దరు ధరిస్తూ గాంధీజీ బాటలో సాగుతూ భర్త ఆశయాలకు అనుగుణంగా జీవితం గడిపిన హాజరా బీబి 1994లో తుదిశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌