పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

207

95. హజరా బీబి ఇస్మాయిల్‌

(- 1994)

జీవిత భాగస్వామితో పాటుగా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని స్వసమాజం భహిష్కరించినా, ఎన్నికష్టనష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో తమదైన మార్గంలో జాతీయోద్యమ బాటలో సాగిన మహిళ హాజరా బీబి.

ఆంధ్రప్రదేశ్‌, గుంటూరు జిల్లా తెనాలి పట్టణం కేంద్రంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయాధులు మహమ్మద్‌ ఇస్మాయిల్‌ సాహెబ్‌ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. హజరా బీబి ఆయన భార్య. జాతీయోద్యమంలో ఆమె మహమ్మద్‌ ఇస్మాయిల్‌ వెంట నడిచిన సహచరి. గాంధీజీ ప్రబోధంతో ప్రభావితులైన ఆ దంపతులు ప్రత్యేకంగా ఖద్దరు ప్రచారోద్యమంలో అమితోత్సాహంతో పాలుపంచుకున్నారు. గుంటూరు జిల్లాలో తొలి ఖద్దరు దాుకాణం ప్రారంభించి, ఖద్దరు ఇస్మాయిల్‌ గా పేర్గాంచిన ఇస్మాయిల్‌కు హాజరా బీబి అన్ని విషయాలలో అపూర్వమైన తోడ్పాటునిచ్చారు.

ఆ కాలంలో అఖిల భారత ముసింలీగ్ కు ఆంధ్రపదశ్‌లోని తెనాలి ప్రదాన కంద్రంగా ఉండేది. ఈ కేంద్రం నుండి ముస్లింలీగ్ కార్యకలాపాలు విసృతంగా సాగాయి. తెనాలి నేత ఖద్దర్‌ ఇస్మాయిల్‌ దంపతులు భారత జాతీయ కాంగ్రెస్‌లో కొనసాగటం, గాంధీజీ విధానాల పట్ల అత్యంత గౌరవభావంతో ఉండటం మాత్రమే కాకుండా ఆచరణలో

చిరస్మరణీయులు