పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

206

విజయాలను సాధించి బాద్షాఖాన్‌ (సర్దార్‌ లకు సర్దార్‌) అన్పించుకున్నారు. 1919లో రౌలత్‌ వ్యతిరేక ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనటం ద్వారా ఆయన జాతీయోద్యమ ప్రవేశం చేశారు.1928 నాటి కలకత్తా సమావేశంలో గాంథీజీ ప్రసంగం విన్నఆయన మహాత్ముని మాటను తన బాటగా స్వీకరించి 1929లో ఖుదా-యే- ఖిద్మాత్‌గార్‌ (భగవత్సేరకులు) సంస్థ స్థాపించారు. బాద్షాఖాన్‌ కృషి వలన 'అనాగరికుడు, మృగప్రాయుడు, పులిలాంటి క్రూరుడు, విశ్వాసపూతకుడైన హంతకుడు' అని ఆంగ్లేయుల శాపనార్థాలకు గురైన పఠాన్లు శాంతి ప్రియులైన భగవత్సేవకులయ్యారు. 1930లో పెషావర్‌లోని ఖిస్సాఖాని బజారును పోలీసులు శవాలదిబ్బగా మార్చినా చిన్నరాయి ముక్కను కూడ ఆంగ్లేయాధికారులు, సైనికులు, పోలీసుల మీద విసరకుండా తుపాకిగుళ్ళకు ఎదురొడ్డి ప్రాణత్యాగాలతో భగవత్సేవకులు ప్రపంచ ప్రజల ప్రశంసలందుకున్నారు.

1931 మార్చి 31న కరాచిలో అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశానికి ఖుదా-యే- ఖిద్మాత్‌గార్‌ సభ్యులతో సహా హజరైన ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ తరువాత బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ మహాసబల అధ్యక్ష స్థానం స్వీకరించాల్సిందిగా కాంగ్రెస్‌ ప్రముఖులు ఆయనను కోరగా, 'నేను జీవితాంతం సెనికుడ్ని మాత్రమే' అంటూ తిరస్క రించారు. జాతీయోద్యమంలో ఆయన 15ఏండ్లు దుర్బర జెలుశిక్షను అనుభవించారు. ఒకవైపు న పరాన్‌ జాతుల్లో సంస్కరణలకు పాటుపడుతూ మరోవైపున మతోన్మాదశక్తులను ఎదాుర్కొంటూ రాజకీయంగా ముందుకు సాగిన బాద్షాఖాన్‌ 1937నాటి ఎన్నికలలో జాతీయ కాంగ్రెస్‌కు వాయవ్య సరిహద్దు ప్రాంతాలలో ఆధిపత్యాన్ని సమకూర్చి పెట్టారు.

భారత విభజనను తొలుత నుండి వ్యతిరేకించిన ఆయన 1947 మేలో విభజనను అంగీకరిస్తూ జాతీయ కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకించిన ఏకైక ప్రముఖునిగా ముస్లింలీగ్ ఆగ్రహానికి గురయ్యారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మమ్మల్ని తోడేళ్ల పాల్జేశారు అని ఆయన ఆవేదన వ్యకంచేశారు. అందుకు ఆగ్రహంచిన పాకిస్తాన్‌ ప్రబుత్వం గఫార్‌ ఖాన్‌ను ద్రోహిగా పరిగణించింది. ఆ కారణంగా ఆయన పాకిస్థాన్‌లో మరో 15 ఏండ్ల పాటు జైలు జీవితాన్ని, ఆరేండ్ల ప్రవాస జీవితాన్ని గడపాల్సి వచ్చింది. 1987లో ఖాన్‌సాబ్‌ ఇండియా వచ్చిన సందర్బంగా ఆయనను భారతరత్న అవారుర్డుతో భారతీయులు గౌరవించుకున్నారు. భయానక నిర్బంఢాన్నై నా చాలా తేలిగ్గా తీసుకుని క్రూర నియంతలను కూడా ఖాతరు చేయక జీవిత పర్యంతం అహింసా యోధునిగా తాను నమ్మిన మార్గంలో ముందుకు సాగిన సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ 98 ఏండ్ల వయస్సులో 1988 జనవరి 20న కాలం చేశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌