పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

205

94. ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌

(1890-1988)

మన వాయవ్య సరిహద్దు ప్రాంతాల నివాసులైన పఠాన్‌లను భగవత్సేవకుల రూపంలో అపూర్వమనదగిన శాంతి సైనికులుగా తీర్చి దిద్ది ప్రపంచ ప్రఖ్యాతిపొందిన అహింసామూర్తి ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ సరిహద్దు గాంధీ గా విశ్వమంతా విఖ్యాతుడు.

1890లో వాయవ్య సరిహద్దు ప్రాంతంలోని పెషావర్‌ జిల్లా, చార్‌సద్దా తహసిల్‌, ఉత్తమంజాయ్‌ గ్రామంలో ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ జన్మించారు. తండ్రి ఖాన్‌బెహ్రం ఖాన్‌ ఉత్తమంజాయ్‌ు గ్రామ సర్దార్. గపార్‌ ఖాన్‌ విద్యాభ్యాసం తరు వాత బ్రిటిష్‌ సైన్యంలోని Guides Mission విభాగంలో చేరారు. ఒక పఠాన్‌ సైనికుని పట్ల ఆంగ్లేయాధికారి అగౌరవంగా ప్రవర్తించటం చూసి 1906లో సైన్యం నుండి బయటకు వచ్చారు. 1908లో అలిఘర్‌ వెళ్ళి అక్కడి నుండి విదేశాలకు వెళ్ళాలనుకున్నా తల్లి అయిష్టత వ్యక్తం చేయడం వలన విరమించుకున్నారు.

స్వగ్రామానికి తిరిగి వచ్చి వాయవ్యసరిహద్దు ప్రాంతాలలో పలు పర్యటనల ద్వారా, ప్రజల స్థితిగతులను అధ్యయనం చేసిన ఆయన ప్రగతికి విద్యా-వికాసాలే సోపానాలుగా భావించారు. మిత్రుడు అబ్దుల్‌ అజీజ్‌ సహకారంతో 1910లో ఉత్తమంజాయ్‌లో ఆజాద్‌ జాతీయ పాఠశాలను ప్రారంభించి పఠాన్ల జీవితాలలో గుణాత్మక మార్పులకు కారణం అయ్యారు. పరాన్‌ ప్రజానీకంలో సంస్కరణలకు కృషిచసి అతి కష్టం మీద గణణీయమైన

చిరస్మరణీయులు