పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

విడుదల కాగానే సేవాగ్రాం వచ్చి బాపూజీకి వ్యక్తిగత సహాయకురాలిగా బాధ్యతలు చేపట్టారు.ఆ పాత్రలో ఆమె గాంధీజీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ అన్ని సందర్భాలలో ఆయన వెంట ఉంటూ దేశమంతా తిరిగారు. ఈ పర్యటనల ఫలితంగా ఆమె పలు భాషలతోపాటు తెలుగు భాషను నేర్చుకున్నారు.

స్వరాజ్య సాధనతోపాటుగా హిందాూదూ-ముస్లింల ఐక్యత, హరిజనుల సంక్షేమం మహిళాభ్యుదయం తన జీవిత లక్ష్యాలుగా ఆమె ప్రకటించుకున్నారు. మహాత్ముని బాటన జాతీయోద్యమంలో నడిచిన అమతుస్సలాం హిందూ-ముసిం ఐక్యతకు చిహ్నమయ్యారు. మతకలహాలు విజృంభించినప్పుడు వాయవ్య సరిహద్దులు, సింధ్‌, నౌఖాళి ప్రాంతాలలో శాంతి-సామరస్య స్థాపనకు గాంధీజీ దూతగా ఆయా ప్రాంతాలు పత్యటించి, ఘర్షణల నివారణకు 20 రోజులపాటు సత్యాగ్రహదీక్ష చేసి గాంధీజీ వారసు రాలు అన్పించుకున్నారు.

1947లో జాతీయోద్యమకారులు కనflకలలను భగ్నం చేస్తూ ఇండియా రెండు ముక్కలయ్యింది. ఆ విఘాతం నుంచి బయటపడే లోపుగా గాంధీజీ హత్యకు గురయ్యారు. ఆ దుస్సంఘటనలకు చలించిపోయిన ఆమె త్వరితగతిన ఆ ఆవేదన నుండి బయటపడి గాంధీజీ బాటలో ప్రజాసేవకు పూర్తిగా పునరంకితమయ్యారు. పంజాబ్‌లోని రాజపూర్‌ గ్రామంలో కస్తూర్బా గాంధీ పేరిట కస్తూర్బా మందిరం అను ఆశ్రమాన్నినెలకొల్పి మహిళలకు పలు వృత్తులలో శిక్షణ కల్పించి వారి ఆర్థిక అభ్యున్నతికి తొడ్పడ్డారు. దళిత జనులలో అక్షరజ్యోతులను వెలిగించేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. జాతి సమైక్యత, సమగ్రతలను పటిష్ట పర్చేందుకు, హిందూ ముస్లింల మధ్య ఐక్యతా భావాలను ప్రచారం చేసేందుకు హిందూస్థాన్‌ అను ఉర్దూ పత్రికను ఆమె చాలా కాలం నడిపారు.

చివరివరకు ప్రజా సేవలో గడిపిన అముతస్సలాం 1961లో భారత దేశం వచ్చిన ఖాన్‌ అబ్దుల్‌ గపార్‌ ఖాన్‌ వెంట ఉండి ఆయనకు సేవలందిస్తూ ఆయన చేసిన దేశవ్యాప్త పర్య టనలో పాల్గొన్నారు. 1962లో చెనాతో, 1965లో పాకిస్థానతో యుద్దం వచ్చినప్పుడు తన దత్త కుమారుడు సునీల్‌ కుమార్‌ సహాయంతో పర్వత ప్రాంతాలకు అతికష్టం మీదచేరుకుని అక్కడ పహారా కాస్తున్న జవానులను ఉత్సాహపర్చుతూ సేవలందించారు.

చిన్నతనం నుండి అనారోగ్యంతో పోరాటం సాగిస్తూ అవివాహితగా మిగిలిపోయినా, జాతీయోద్యమంలో ఆహింససాయుత మార్గాన సాగారు. ఆ తరువాత స్వతంత్ర భారతావనిలో సామాజిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిసూ,చరమాంకం వరకు గాంధీజీ తాత్విక భావాల వారసురాలుగా ఖ్యాతిగడించిన బీబి అమతుస్సలాం 1985 అక్టోబర్‌ 29న మృతిచెందారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌