పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

పరిసితుల దృష్ట్యా జపాన్‌ తన స్వీయరక్షణ కోసం ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను యుద్దరంగంలో ఒంటరిని చేసి తప్పుకుంది. ఆ క్లిష్ట సమయంలో సైనికులలో ఆత్మవిశ్వాసం నూరిపోస్తూ, అందరిలో తానొకడిగా అన్నిరకాల కష్టనష్టాలను అనుభవిస్తూ, తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు షానవాజ్‌ కృతనిశ్ఛయంతో నిలిచారు.

1945లో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ మీద బ్రిటిష్‌ సేనలు విరుచుకుపడ్డాయి. ఆ భీకర పోరులో చాలామంది అమరత్వం పొందాగా, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సైనికులను, మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ లాంటి అధికారులను మే 13న బ్రిటిష్‌ సైన్యం నిర్బంధించి, వారిని రాజద్రోహులుగా పరిగణిస్తూ 1945 నవంబర్‌ 5న డిల్లీలోని ఎర్రకోటలో విచారణ జరిపింది. ఆ సందర్భంగా మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ పక్షాన మాత్రమే వాదించేందుకు ముస్లింలీగ్ నాయకులు మహమ్మద్‌ అలీ జిన్నా సంసిద్దత ప్రకటించగా, We have stood shoulder to shoulder in the struggle for freedom. My comrades have died on the field of battle inspired by our leadership. We stand or fall together అంటూ జిన్నాప్రతిపాదనను తిరస్క రించి సంచనలం సృషించారు.1946 జనవరి 3న షానవాజ్‌ ఖాన్‌ తదితరులకు ఆజన్మద్వీపాంతరవాస శిక్షను ప్రకటించింది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఈ విచారణ సందర్భంగా భారత జాతీయ కాంగ్రెస్‌ నేతలతో ఏర్పడిన సఖ్యత, ప్రదానంగా పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ˙తో స్నేహం వలన జనరల్‌ షానవాజ్‌ కాంగ్రెస్‌ లో చేరి గాంధీజీ, మౌలానా ఆజాద్‌ తదితరులతో కలసి పనిచేశారు. ఆ సమయంలో బీహార్‌ తదితర ప్రాంతాలలో మతసామరస్యాన్ని పరిరక్షించేందుకు, భిన్న మతస్తుల మధ్య స్నేహ సంబంధాలను పునరుద్దరించేందుకు షానవాజ్‌ ఖాన్‌ ఎంతగానో కృషిచేశారు.

1947లో భారత దేశానికి స్వాతంత్య్రం లభించాక 1956లో లోక్‌సభకు ఎన్నికైన షానవాజ్‌ ఖాన్‌ మరో రెండుసార్లు విజయం సాధించి కేంద్ర మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ తరువాత మారిన రాజకీయ వాతావరణంలో ఇమడ లేకపోయిన ఆ సైనికాధికారి 1977 నాటి సార్వత్రిక ఎన్నికలలో పరాజితులయ్యారు. ఈ పరాజయం తరువాత రాజకీయాల నుండి పూర్తిగా వైదొలగి సాంస్కృతిక, సాంఘిక సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లోని సేనా నాయకుడిగా తన అనుభవాలను My Memories of the INA and its Nethaji అను ప్రసిద్ధగ్రంథంలో వెలువరించారు.

మాతృభూమి గర్వించదగిన సేనానాయకునిగా, రాజకీయనేతగా, రచయితగా, సాంఫిుక, సాంస్కతిక సేవాతత్పరుడిగా బహుముఖ పాత్రలు నిర్వహించిన మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ 1983 డిసెంబర్‌ 9న అంతిమశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌