పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

199

91. మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌

(1914-1983)

బ్రిటిష్‌ సైనిక స్థావరాల మీద విజయవంతంగా జరిపిన చారిత్రక దాడులకు నాయకత్వం వహించి, చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సేనానులలో మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ ప్రముఖులు.

1914 జనవరి 24న పాకిస్థాన్‌లోని రావల్పిండిలో షానవాజ్‌ ఖాన్‌ జన్మించారు. తండ్రి తిక్కాఖాన్‌ బ్రిటిష్‌ సైన్యంలో ఉన్నాతాధికారి. ప్రాథమిక విద్యను పూర్తిచసిన షానవాజ్‌ సైనిక విద్యను పూర్తిచేసుకుని 1935లో బ్రిటిష్‌ సైన్యంలో అధికారిగా చేరారు. 1943లో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఏర్పడిన విషయాన్ని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 1943 జులై 5న ప్రకటించి బ్రిటిష్‌ సైన్యంలోని స్వదేశీయులను ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లోకి ఆహ్వానించగా ఆ మేరకు షానవాజ్‌ ఖాన్‌ నేతాజీ వెంట బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటంలో అడుగిడారు.

నేతాజీ స్వయంగా ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌ మేజర్‌ జనరల్‌గా కెప్టెన్‌ షానవాజ్‌ ఖాన్‌ను నియమించారు.1944లో భారత్‌ సరిహద్దులకు చేరుకున్న ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ రెండు చోట్ల బ్రిటిష్‌ సైన్యాలను ఎదుర్కొని మట్టి కరిపించింది. ఆ పోరులో విజేతలుగా నిలచిన ఒక దళానికి మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ నాయకత్వం వహించారు. ఈ అపూర్వ విజయం తెచ్చిపెట్టిన ఆనందం నుండి తేరుకోక ముందే, అంతర్జాతీయంగా ఏర్పడిన

చిరస్మరణీయులు