పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

197

90. బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా

(1896-1981)

జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళటం ఎంతో గౌరవంగా ప్రజలు భావించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే జైలుకు వెళ్ళక పోవటం కూడా అపచారంగా పరిగణించారు. ఆ క్రమంలో జైలుకు వెళ్ళడం ఆలశ్యం కావడం కూడా అవమానంగా భావించిన ఉద్యమ స్పూర్తి గల కుటుంబ సభ్యురాలు బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హెదారాబాద్‌ నగరంలో బేగం ఖుర్షీద్‌ ఖ్వాజా 1896లో జన్మించారు. స్వగృహంలో బేగం ఖుర్షీద్‌ సాంప్రదాయక విద్యను పూర్తి చేశారు. సరోజిని నాయుడుతో ఆమెకు ఏర్పడిన పరిచయం వలన జాతీయోద్యమం పట్ల ఆకర్షితురాలయ్యి 1920లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు.

జాతీయోద్యమకారులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖ్వాజా అబ్దుల్‌ మజీద్‌ను ఆమె వివాహమాడారు. వివాహం తరు వాత 1921 డిసెంబరులో హెదారాబాద్‌ నగరంలో జరిగిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు ఆమె ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రతినిధిగా హజరయ్యారు. ఆ సమావేశాలలో బేగం హసరత్‌ మోహాని, బేగం ముహమ్మద్‌ అలీ, కమలా నెహ్రూ˙, స్వరూపరాణి నెహ్రూ˙ లాంటి ప్రముఖులతో కలిసి ఆమె పని చేశారు. ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమ కార్యకలాపాలలో అవిశ్రాంతంగా పాల్గొంటూ

చిరస్మరణీయులు