పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

చేరుకోవడంతో ఆయన జీవితంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఆయన కమ్యూనిజం పట్ల ఆకర్షితులు కావడం మాత్రమే కాకుండా భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరయ్యారు.

బ్రిటిష్‌ ప్రభుత్వం మీద కత్తికట్టేందుకు, కమ్యూనిస్టు ఉద్యమాన్ని మాతృదేశంలో నిర్మించేందుకు రష్యాలోని భారతీయ యువకులను ఎం.యన్‌. రాయ్‌ స్వదేశానికి పంపగా ఆ దళంతోపాటుగా బ్రిటిష్‌ గూఢచారి దళాల కన్నుగప్పి షౌకత్‌ ఉస్మాని స్వదేశం చేరు కున్నారు. కమ్యూనిస్టుల మీద కన్నేసిన బ్రిటిష్‌ రహస్య పోలీసుల దళం 1923 మే 11న ఆయనను అరెస్టు చేయడంతో 'పెషావర్‌ కుట్ర కేసు'లో నిందితులయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్టుగా ఆయన మీద పలు కేసులు నమోదు కావడంతో ఏండ్ల తరబడి దుర్భర జైలు జీవితాన్ని చవిచూడాల్సి వచ్చింది.

ఆనాడు 1.బ్రిటిష్‌ పాలనను కూలద్రోసి సంపూర్ణ రాజకీయ ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించటం 2. సామ్రాజ్యవాదంతో ముడిపడిన స్వదేశీ సంస్థానాలు, జమీందారి విధానం, భూస్వామ్య విధానం రద్దు చేయడం 3. ప్రజారంజకమైన ప్రజాతంత్ర వ్యవసను నిర్మించడం లక్ష్యమ్గా ఆయన నిర్దేశించుకుని, ఆ లకక్ష్యసాధానకోసం పలు సంస్థలను నిర్మించారు. భారత దేశంలో సామ్యవాద భావజాలాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమబాటన నడిపించేందుకు 1925 డిసెంబర్‌లో స్వదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు.

ఆ క్రమంలో జాతీయ కాంగ్రెస్‌కు దూరమయ్యారు. జాతీయ కాంగ్రెస్‌కు దూరమైనా వలసపాలకులకు వ్యతిరేకంగా సాగుతున్న జాతీయోద్యమానికి సహకరించారు. ఉద్యమకారుడిగా, రచయితగా, కమ్యూనిస్టుగా షౌకత్‌ ఉస్మాని తనదైన తీరులో బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమించారు.

భారత దేశానికి స్వాతంత్య్రం లభించాక ఆయన కరాచి వెళ్ళిపోయారు. కరాచిలో కూడా ఆయన కార్మిక జనసముదాయాల పక్షం వహించి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలలో భాగం పంచుకున్నారు. అక్కడ కొంతకాలం గడపాక ఆయన పలు దేశాలు పర్యటిస్తూ జర్నలిస్టుగా అంతర్జాతీయ వ్యవహారాల మీద సైద్దాంతిక వ్యాసాలను రాస్తూ కమ్యూనిస్టు మేధావిగా బహుళ ప్రాచుర్యం పొందారు.

ఈ విధమ్గా ఏదోఒక రూపంలో చివరికంటా బ్రిటిష్‌ వలసపాలకుల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ, విముక్తిపోరాట యోధుడుగా, శ్రామికజన పక్షపాతిగా పలు పోరాటాలు సాగించిన షౌకత్‌ ఉస్మాని 1978లో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌