పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

195

89. షౌకత్‌ ఉస్మాని

(1901-1978)

మన దేశం నుండి సామ్రాజ్యవాద దోపిడి శక్తులను తరిమివేశాక ఈ గడ్డ మీదున్న అసంఖ్యాక కార్మిక-కర్షక, సామాన్య జనసముదాయాల సంక్షేమం-అభ్యున్నతికి ఉపయుక్తం కాగలదని భావించిన సామ్యవాద వ్యవస్థ ఏర్పాటు కోసం ఉద్యమించిన యోధులలో ప్రముఖులు షౌకత్‌ ఉస్మాని.

1901 డిసెంబర్‌ 21న రాజస్థాన్‌ రాష్ట్రం బికనీర్‌ రాళ్ళు కొట్టే శ్రామిక కుటుంబాన ఆయన జన్మించారు. చిన్ననాటనే జాతీయోద్యమ నాయకులు సంపూర్ణానంద గురుత్వం లభించటంతో షౌకత్‌ ఉస్మాని జాతీయ భావనలను సంతరించుకున్నారు.

భారతదశమంతా రెపరెపలాడుతున్న ఖిలాఫత-సహాయనిరాకరణోద్యమ పతాకాల ప్రేరణతో షౌకత్‌ ఉస్మాని ఖిలాఫత్‌ ఉద్యమంలో ప్రవేశించారు. 1920 జూన్‌ మాసంలో లక్నోకు చెందిన మౌల్వీ అబ్దుల్‌ బారి (ఫిరంగి మహాల్‌) పిలుపు మేరకు బయట నుండి బ్రిటిషర్ల మీద యుద్ధం ప్రకటించాలని నిర్ణయించుకుని స్వదేశం వదలిన యువకుల్లో షౌకత్‌ ఉస్మాని చేరారు. అలా వెళ్ళిన కుటుంబాలకు అంతర్జాతీయ పరిణామాల మూలంగా ఆఫ్గనిస్థాన్‌ అధినేత అమానుల్లా తన దేశంలోకి అనుమతించకపోవడంతో తప్పనిసరి పరిస్థితులలో షౌకత్‌ ఉస్మాని నాయకత్వంలోని ఒక దళం రష్యా వెళ్ళేందుకు నిర్ణయించింది. ఆ చారిత్రక నిర్ణయం మేరకు సాహసోపేత హిజ్రత్‌ చేసిన షౌకత్‌ ఉస్మాని రష్యా

చిరస్మరణీయులు